📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Atreyapuram: ఒక విద్యార్థికి.. ఇద్దరు ఉపాధ్యాయులు

Author Icon By Sharanya
Updated: June 26, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆత్రేయపురం (తూర్పు గోదావరి జిల్లా): ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు నేడు వెల వెలబోతున్నాయి. జూన్ 1వ తేదీన తల్లికి వందనం (Thalliki vandanam) ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి వేయడం జరిగింది. మరో ప్రక్క స్కూల్ యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగ్, మధ్యాహ్నం భోజనం ఎంతో ఆధునికరణతో తరగతిగదులు ఇన్ని సౌకర్యాలు ఉన్నా విద్యార్థుల రాక కోసం ఎదురుచూస్తున్నాయి.

ఒక విద్యార్థికి ఇద్దరు టీచర్లు

వివరాల్లోకి వెళితే ఆత్రేయపురం (Atreyapuram) మండలం లొల్ల బీసీ కాలనీలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక 1 నెంబరు పాఠశాలలో ఒకటి నుండి రెండో తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నా విద్యార్థులు లేక పోవడం విశేషం. ఇద్దరు టీచర్లు ఉండగా ఇద్దరూ కలిపి ఒక విద్యార్థికి చదువు చెబుతుండడం విశేషం. అలాగే తాడిపూడి ఎస్సీ కాలనీలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండో నాలుగో తరగతి చదివే ఇద్దరు మాత్రమే చదువుతున్నారు. వారికి ఒకరే ఉపాధ్యాయులు. కానీ కొన్ని పాఠశాలలో విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేరు ఎందుకు ప్రభుత్వ పాఠశాలకు ఎన్నో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నా విద్యార్థులు రావడంలేదంటే.. ఉపాధ్యాయులకు చదువు చెప్పక రావడంలేదా.. లేదంటే ప్రైవేట్ స్కూల్ లో పిల్లలను చదివించడానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారా. అన్నది దేవుడికే ఎరుక… అంకంపాలెం గ్రామ శివారు పాటి చెరువుదగ్గర స్కూలు ఉన్నప్పటికీ అది శిదిలావస్థకు చేరడంతో గత వైసీపీ ప్రభుత్వం లో కూల్చివేసి నూతన భవనం నాడు నేడు 10లక్షలతో నూతనంగా భవనం చేపట్టారు. అక్కడ విద్యార్థులను కొంతకాలం బిసి కమ్యూనిటీ భవనలో చదువులు నిర్వహించేవారు.. కొంతకాలం నిర్వహించకా విద్యార్థలు లేక పూర్తిగా ముసివేశారు.

అలాగే తాడపూడి ప్రాథమిక పాఠశాల వైకాపా హయాంలో నాడు నేడు లో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన పాఠశాల భవనం నిర్మాణం పనులు నిలిచిపోవడంతో పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్లో భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు ఈ స్కూల్లో 15 నుండి 20 మంది దాకా చదివే వారు. జూన్ 14న ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొన్ని పాఠశాలల్లో రిలీవర్ రాలేదన్న కారణంగా ఉపాధ్యాయులని బదిలీ అయిన ప్రాంతాలకు రిలీవ్ చేయలేదు. దాని తర్వాత ఆ స్థానాలలో కొత్తగా ఎం టి ఎస్ ఉపాధ్యాయరాలు వచ్చినా లొల్ల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల 1 రెగ్యులర్ ఉపాధ్యాయరాలుతో పాటు ఆ ఇద్దరు టీచర్లు అదే పాఠశాలలో కొనసాగుతున్నారు.ఇది అధికారులు నిరక్ష ్యం గా చెప్పవచ్చు. వల్ల ఒకచోట ఉపాధ్యాయుల అధికంగానూ విద్యార్థులు తక్కువగాను మరొకచోట విద్యార్థులు అధికంగాను ఉపాధ్యాయులు తక్కువగాను ఉన్నారు.

Read also: Road Accident: రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి..

#Atreyapuram #EducationMatters #InspiringStory #OneStudentTwoTeachers #RuralEducation #VillageSchool Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.