📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: Atchannaidu:దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు

Author Icon By Pooja
Updated: December 16, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : పిపిపి (Public Private Partnership) మోడల్ ద్వారా వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నా యని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ విధానం పేద ప్రజలకు, మధ్య తరగతి విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా రూపు దిద్దబడిందని ఆయన అన్నారు. వైఎస్సార్సి ధర్నా పేరుతో మాయాజాలం చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్పటికీ, ఈ పార్టీ గత ఐదు ఏళ్లలో రాష్ట్రాన్ని 20 ఏళ్ల వెనుకకి తానీడిచి, ప్రజలను నిర్లక్ష్యానికి వదిలే సిందని, కేవలం 11 సీట్లు మాత్రమే ప్రజలు ఇచ్చా రని మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలి పోయి, అసెంబ్లీకి రాకుండా చరిత్రలో నిలిచిపోతు న్నారని, ఇలాంటి పార్టీకి ప్రజా ఉద్యమాలు చేసే అర్హత లేదని విమర్శించారు.

Read Also: Jagan Vijayawada Visit : నేడు విజయవాడలో జగన్ పర్యటన

Atchannaidu: The number of medical seats is set to increase to nearly 2,000.

కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న పిపిపి మోడల్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణం కేవలం 2 సంవత్సరాల్లో పూర్తవుతుందని, గతంలో ఆదేపనికి 20 యేళ్లు పడు తుందని వివరించారు. పిపిపి విధానం ద్వారా మొత్తం మెడికల్ సీట్లు 500 నుంచి 1700-2000కి పెరుగుతాయని, ప్రత్యేకంగా పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం 850 సీట్లు కేటాయింపుగా ఉంటాయని చెప్పారు. అదనంగా 220 సీట్లు ప్రభుత్వ కోటాలో 110 సీట్లు పెరుగు తాయని, పిపిపి ఆసుపత్రుల్లో అంతర్జాతీయ స్థాయి వసతులు, హైక్వాలిటీ సిబ్బంది, సూపర్ స్పెషా లిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని, యూని వర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

వైఎస్సార్సి పాలనలో వైఫల్యాలు..

గత ఐదేళ్లలో వైఎస్సార్సి పాలనలో మెడికల్ రంగంలో చేసిన విఫలతలనుకూడా మంత్రి అచ్చె న్నాయుడు(Atchannaidu) ఎత్తిచూపారు. ఈ సమయంలో ఖర్చు చేసిన రూ. 1550 కోట్లు కేవలం కేంద్ర నిధులే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, 18 శాతమే కాలేజీలు నిర్మాణంలో పూర్తయిందని తెలిపారు. జగన్ ప్రారంభించిన ఐదు కాలేజీలను నేషనల్ కౌన్సిల్ పాఠశాల స్థాయిలో నిర్మాణం అని గుర్తించి సీట్లు తగ్గించిం దని, కోవిడ్ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్రంలో లేరని, పేదవారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక వసతులు కూడా పొందలేకపోయా రని, ప్రజలకు కఠిన పరిస్థితులు ఎదురయ్యా యన్నారు.

ప్రజలకు భవిష్యత్ లాభాలు..

మహిళలు, పిల్లలు, పేదవారికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో, కూటమి ప్రభుత్వం పిపిపి మోడల్ద్వారా 2 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీలు పూర్తిచేయగలుగుతుందని, మొత్తం సీట్లు 1700-2000కి పెరుగుతాయని, పేదవారికి ప్రత్యేకంగా 850 సీట్లు కేటాయించబడుతాయని, ఆసుపత్రుల్లో 1500 బెడ్స్ వరకు విస్తరణ జరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వైఎస్సార్సీ చేసే నాట కాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. పిపిపి మోడల్ ద్వారా పేదలకు, మధ్య
తరగతికి, ప్రజలకు అందుబాటులో ఉన్న వనరులను తెలియజేయాలని కోరారు.

కోటి సంతకాల సేకరణ ఓ మాయాజాలం

వైఎస్సార్సీ ‘కోటి సంతకాల సేకరణ’ పేరుతో ప్రజలను మాయాజాలంలో మోసాడుతున్న విధానాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు. ఇలాంటి నాటకాలు పేద, మధ్యతరగతి ప్రజలను వంచించడమే కాక, వారి కష్టాలను రాజకీయ ప్రయోజనాలకు తిప్పే ప్రయత్నం మాత్రమే అని మంత్రి అన్నారు. కేవలం సంతకాల సేకరణతోనే గందరగోళం సృష్టించడం వైఎస్సార్సీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ మాయాజాలం, ప్రజల కోసం నేరుగా ఉపయోగపడని వ్యర్థ ప్రయత్నమని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం నిజమైన పనితో, ప్రజల శ్రేయస్సుకు, పేదవారి అభివృద్ధికి ముందడుగు వేస్తోంది, వైఎస్సార్సీ చేస్తున్న వ్యర్థ నాటకాలను ప్రజలు గమనించి, తిరస్కరించాలని పిలుపునిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

APGovernment Google News in Telugu Latest News in Telugu MedicalEducation MedicalSeats

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.