Atchannaidu : టమోటా ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు భరోసా

Read Time:  1 min
Atchannaidu : టమోటా ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు భరోసా
FONT SIZE
GET APP

Atchannaidu : విజయవాడ టమోటా ధరలపై రైతులు ఆందోళన పడాల్సిన అవసం లేదని వ్యవసాయశాఖా మంత్రి కింజరపు అచ్చెన్ననాయుడు Atchannaidu అన్నారు. ఆయన కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాప్తాడు మార్కెట్ లో టమోటా ధరలు గరిష్టం రూ.18, కనిష్ఠం రూ.9, మోడల్ ధర రూ.12 గా ఉన్నాయి వివరించారు. 30 నుండి 40 మెట్రిక్ టన్నులు మించి పత్తికొండ Pattikonda మార్కెట్ సరుకు రాదు, దసరా సెలవులు కావడంతో మరొక 10 టన్నులు అదనంగా చేరుకుంది.. రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించారు. అది సరికాదన్నారు. ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించామన్నారు.

AP Cabinet Meeting : ఈ నెల 10న క్యాబినెట్ భేటీ.. డీఏ ప్రకటన చేసే ఛాన్స్ ..?

Atchannaidu

Atchannaidu

పత్తికొండ మార్కెట్

ఈ రోజు పత్తికొండ మార్కెట్ లో టమోటాలు సేకరించి చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్ కి 10 మెట్రిక్ టన్నులు, రైతు బజార్లకు 15 మెట్రిక్ టన్నులు పంపిస్తాము.. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సరుకు ఎగుమతి వర్షాల వల్ల తగ్గింది… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టమాటా అమ్మకాలు మందగించామన్నారు. రాప్తాడు మార్కెట్ కి 3000 మెట్రిక్ టన్నులు రాగా అందులో కేజీ టమోటా గరిష్టంగా 18 రూ, కనిష్టంగా 9 రూ జరిగింది…టమోటాలకు ట్రెండింగ్ ధరను బట్టి ప్రస్తుతం మంచి ధర లభిస్తుంది, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అన్ని విధాలుగా రైతులను ప్రభుత్వం ఆదుకుంట్నుదని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.

టమోటా ధరలపై రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
ఇటీవల మార్కెట్లో టమోటా ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్ర: టమోటా ధరలపై మంత్రి అచ్చెన్నాయుడు ఏమన్నారు?
రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి నష్టం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

epaper: https://epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.