📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Atchannaidu: తోతాపురి మామిడి రైతుకు చేయూత ఇవ్వండి

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 10:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరిన మంత్రి అచ్చెన్నాయుడు

విజయవాడ: ఎపిలో తోతాపురి రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ఎపి వ్యవసాయశాఖా మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) తో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తోతాపురి మామిడి రైతులకు 12రూ. మద్దతు ధర అందచేశామన్నారు. మామిడి రైతుల కోసం మార్కెట్ మద్దతు కింద రూ.260 కోట్లు ఆర్థిక సాయం అందచేయమని శివరాజ్సంగ్ను వారు కోరారు. వెనుకబడిన జిల్లాలకోసం మైక్రో ఇరిగేషన్ పథకా నికి రాయితీ పెంచాలని విజ్ఞప్తి చేసారు. విభజన చట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తోతాపూరి మామిడిని పండించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను ఏపీ మంత్రి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు.

మామిడిపండ్లను ఫ్యాక్టరీలు

రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో మంత్రి అచ్చెన్నాయుడు చర్చించారు. వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. ముఖ్యంగా రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తోతాపురి మామిడి ధర తగ్గడంతో రైతులకు వచ్చే నష్టాన్ని ముందు గానే గ్రహించి, ధర రూ.8 కన్నా తక్కువకు పడిపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధరగా రూ.12 నిర్ణయించినట్లు వివరించారు. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తొతాపురి మామిడి పంట కొనుగోలు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రికి అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రూ.260 కోట్లు ఖర్చు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం తగిన తోడ్పాటును అందచేయాలని కోరారు. మార్కెట్ మద్దతు పథకం క్రింద తోతాపూరి మామిడిపండ్లను ఫ్యాక్టరీలు లేదా వ్యాపారుల ద్వారా ప్రతి కిలో రూ.12/ ఇందులో రూ.8/ ను ఫ్యాక్టరీలు / వ్యాపారులు చెల్లించగా, మిగిలిన రూ.4/ను రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం భరించనుందని, ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించాలని కేంద్ర మంత్రికి వివరించారు.

మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ

ప్రతి పాదిత పంట కోసం క్రింద ధర లోటు చెల్లింపు అమలులో కనీస మద్దతు ధరలో 50శాతంను రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నట్లు, కేంద్ర ప్రభుత్వం 100 భరించవలసిందిగా విజప్తి చేశారు. అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాలని కోరారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలన్నారు. గుంటూరులో చిల్లీ బోర్డ్, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డ్, చిత్తూరు లో మామిడి బోర్డ్ లను ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనకరమైన ఫలితాలను రాబట్టవచ్చని వివరించారు. విభజన చట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం (Central Agricultural University) ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సంవత్సరంలో మామిడిపండు గుజ్జు ఫ్యాక్టరీల్లో నిల్వలు పెరగడం మరియు ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల, ధరలు గణనీయంగా పడిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులకు న్యాయమైన ధర లభించేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరం ఉందన్నారు. రూ.12/ కిలో ధరకు, మొత్తం అంచనా వ్యయం రూ.780 కోట్లు అవుతుందని, ఇందులో ఫ్యాక్టరీలు/వ్యాపారులు ప్రతి కిలోకు రూ.8/ చెల్లించగా, అంచనా వ్యయం రూ.520 కోట్లు, మిగిలిన రూ.260 కోట్లు (రూ.4/ కిలోకు) ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉంటుందన్నారు.

Atchannaidu: తోతాపురి మామిడి రైతుకు చేయూత ఇవ్వండి

మైక్రో ఇరిగేషన్

పై అంశాలను దృష్టిలో ఉంచుకొని, కేంద్ర ప్రభుత్వం, రైతుల ప్రయోజనాన్ని కాపాడటానికి, ధర పతనం అయిన నేపథ్యంలో మార్కెట్ మద్దతు పథకం కింద ఆర్థిక సహాయం రూ.260 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. మైక్రో ఇరిగేషన్ అమలు ద్వారా వ్యవసాయ స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని (Water use efficiency) మెరుగుపరచడం, ఎరువుల వినియోగం, కూలీ ఖర్చులు మరియు ఇతర పెట్టుబడులను తగ్గించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులలో 78 మంది చిన్న, అతి చిన్న రైతులే కాగా, మైక్రో ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన 45 రైతుల వాటాను భరించలేని స్థితిలో ఉన్నారని.

తదుపరి ఐదు సంవత్సరాలలో మొత్తం

వ్యవసాయ రంగంలో సుస్థిరత కోసం మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యతను గుర్తించి, ఈ ఎనిమిది వెనుకబడిన జిల్లాల్లో మైక్రో ఇరిగేషన్ విస్తరణను లక్ష్యంగా పెట్టుకొ న్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. 2025-26 సంవత్సరంలో సుమారు 3 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ విస్తరణతో పాటు, తదుపరి ఐదు సంవత్సరాలలో మొత్తం 15 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 15 వృద్ధి సాధించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ పథకాలను (Micro irrigation schemes) ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ పథకం కింద, చిన్న మరియు అతి చిన్న రైతులకు 90 సబ్సిడీతో, అలాగే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ అమలు చేస్తున్నామన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Murali : ఫైళ్ల దగ్ధం కేసు… మాజీ ఆర్డీవో అరెస్ట్

అచ్చెన్నాయుడు ఎవరు?

అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన వ్యవసాయశాఖా మంత్రిగా సేవలందిస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి (TDP) చెందిన సీనియర్ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.

మంత్రి అచ్చెన్నాయుడు జీవిత విశేషాలు?

ఆయన మార్చి 26 1971 న టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం లో జన్మించారు. ఆయన తండ్రి దాలినాయుడు. ఆయన కృష్ణా కళాశాల, విశాఖపట్నంలో బి.యస్సీ చదివారు.

Achchennaidu AndhraPradeshAgriculture APFarmersSupport ShivrajSinghChouhan Telugu News TotapuriMangoFarmers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.