📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Assigned lands : అసైన్డ్ భూములు కార్పొరేట్లకు అప్పగింత!

Author Icon By Sudha
Updated: November 19, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అసైన్డ్ చట్టసవరణకు చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదించింది. ఈ చట్టసవరణతో తమ భూములను రైతులు లీజుకి ఇచ్చు కోవచ్చని, లీజు ద్వారా 30నుంచి 40 వేలు పొందవచ్చని రైతాంగాన్ని మభ్యపెడుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఇక నుంచి కూటమి ప్రభుత్వం అసైన్డ్ భూములు కేటాయిస్తుంది. ఆయా కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్గం నిర్ణయం ప్రకటించింది. ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇచ్చేందుకు 26,43,500 ఎకరాలను గుర్తించారు. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఆసిపి) రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేసే రూరల్ బోర్డు ద్వారా లీజు ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే పరిశ్రమలు నెలకొల్పినవారు, విస్తరణ అవసరాలకు భూములు తీసుకోవచ్చని చెప్పింది. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లోనూ కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. కంపెనీలు ప్రైవేల్ భూములను లీజుకి తీసు కుని ఉంటే, ఆ భూ యజమానులు ప్రయోజనం పొందేలా విధివిధానాలు రూపొందించారు. లీజు కింద అసైన్డ్ రైతులు పొందినట్లే ఏడాదికి లీజు డబ్బులు పొందవచ్చు. కౌలుకి ఇచ్చి న రైతుకుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిబంధన ల్లో పేర్కొన్నారు. దీనివల్ల రైతుకు నికర ఆదాయం వస్తుం దని చెప్పటమంటే, రైతులను మోసగించడమే. అధికారం చేతులు మారకముందు నుంచి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన వ్యవసాయకూలీలు (వీరిలో ఎక్కువ మంది దళితులు ఉన్నారు), పేద రైతులు బంజరు, ఫోరంబోకు భూములు, సముద్ర తీర భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. ఈభూములకు పట్టాలు ఇవ్వాలని కమ్యూ నిస్టు పార్టీ, వ్యవసాయకూలీ సంఘం అనేక ఆందోళనలు చేశాయి. ఆందోళనల ఫలితంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూములకు డిపట్టాలు ఇవ్వటం జరిగింది.

Read Also : http://Telangana Meeseva : తెలంగాణలో మీసేవా ఇప్పుడు వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు మరింత చేరువ

Assigned lands

భూములు అన్యాక్రాంతం

ప్రభుత్వం ఇచ్చి న కొన్ని భూములు వెంటనే సేద్యానికి అనుకూలంగా లేక పోవడంతో, అలాంటి భూములు అన్యాక్రాంతం అయ్యాయి. భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం బలంగా ముందుకు రావడంతో ఆనాటి ప్రభుత్వం 9/1977 లో అసైన్డ్ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టంలో అసైన్డ్ భూములు (Assigned lands) అమ్మటం, కొనటం నేరం. అలా చేసినవారు శిక్షలకు గురౌతారు. అన్యాక్రాంతమైన భూమి తిరిగి గుర్తించడానికి ఇవ్వటం అలా కాని పక్షంలో అర్హులైన మరో లబ్దిదారునికి ఇవ్వాలి. ఈచట్టం చేసిన తర్వాత కూడా కొందరు బడాబాబులు అసైన్డ్ భూములు కబ్జాచేయటం జరిగింది. 2002లో అసైన్డ్ భూములు (Assigned lands) అమ్ముకోవటానికి అవకాశం కల్పిస్తూ జీవో తీసుకువచ్చే ప్రయత్నం చేయగా తీవ్ర వ్యతిరేకత వల్లఉపసంహరించుకుంది. అసైన్డ్ ఉన్నా భూములు కబ్జాఅవుతున్నా, దాన్ని నివారించకుండా, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అసైన్డ్ చట్టాన్ని సవరిస్తూ 2006లో ఆర్డినెన్స్ జారీచేసి శాసనసభ ఆమోదం పొందింది. చట్టంలోని 4వ సెక్షన్, బిక్లాజు సవరణ ద్వారా అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని తిరిగి పేదలకే ఇవ్వాలనే నిబంధన నుంచి మినహాయింపు పొంది అమ్మేహక్కు, ఇష్ట మైనవారికి ఇచ్చే అధికారం ప్రభుత్వం పొందింది. ఈ చట్ట సవరణ పేదలను భూములకు దూరం చేయడమే కాకుండా సెజ్లకు కట్టబెట్టే చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం అసైన్డ్ భూముల లెక్కలు తేల్చేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తూ రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు రెవిన్యూ ప్రత్యేక కార్యదర్శి, ఏపీల్యాండ్ అడ్మినిస్ట్రే షన్ చీఫ్ కమిషనర్ జీవో 104 జారీచేశారు. ఈ జిల్లా కమిటీకి ఇన్చార్జ్ మంత్రి చైర్మన్గా ఉంటాడు. జిల్లాకి చెందిన మంత్రులు సభ్యులుగా, జిల్లా కలెక్టర్ కన్వీనర్గా ఉం టారు. ఈక్రమంలో నిషేధిత 22ఎ జాబితా నుంచి తొల గించిన భూములు 13,59,000 ఎకరాలు ఉన్నాయని, ఇందులో 13,57,000 లక్షల ఎకరాల భూములను ప్రభు త్వం వెరిఫై చేసిందని చెబుతున్నారు.

నిషేధిత 22ఎ భూ ములంటే..

నిషేధిత 22ఎ భూ ములంటే ప్రభుత్వ యాజమాన్యం, చట్టపరమైన వివాదాలు, సీలింగ్ పరిమితులు కారణాలవల్ల రిజస్ట్రేషన్ కాకుండా నిషే ధించబడిన భూములు. ఈభూములు అమ్మడం, కొనడం, రుణం కోసం తనకా పెట్టడం సాధ్యంకాదు. ఇవి రిజిస్ట్రేషన్ చేయబడవు. అలాంటి భూములను నిషేధం నుంచి తొల గించి వాటిని లీజుకి ఇచ్చుకోవచ్చని పేర్కొంది. అసైన్డ్ భూ ములు అన్యాక్రాంతమైతే, ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకే పంపిణీ చేయాలి. కాని కూటమి ప్రభు త్వం అందుకు విరుద్ధమైన చర్యలు తీసుకుంది. అన్యా క్రాంతం పేరుతో అసైన్డ్ భూములను, నిషేధం నుంచి తొలగించిన 22ఎ భూములు 13.59,000 ఎకరాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. కార్పొరేట్లకు ఆ భూములను 99 సంవత్సరాల లీజుకి ఇవ్వటం అంటే,శాశ్వతంగా భూ ములు వారికి కట్టబెట్టటమే. పేదలను భూములకు దూరం చేసి వారిని కూలీలుగా మార్చడమే. గతంలో చంద్రబాబు ప్రోద్బలంతో కుప్పంలో కాంట్రాక్ట్ వ్యవసాయానికిభూములు ఇచ్చిన రైతులకు వచ్చిన చేదు అనుభవాలు ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సాగుకి యోగ్య మైన భూమి కోటి, లక్ష ఎకరాలు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం లో 37 శాతం ఉంది. సాగు యోగ్యంగాని భూమి మూడు లక్షల ఎకరాలు ఉంది. సాగు భూమి సేద్యం చేసేవారికి చెందాలి. దేశంలో, రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా సేద్యం చేయని పరాన్న బుక్కులైన భూస్వాముల వద్ద భూమి బం ధించబడి ఉంది. 1973లో చేసిన భూసంస్కరణల చట్టం ద్వారా మిగులు భూమి 18 లక్షల ఎకరాలు. దాన్ని కుదిం పులతో 7.9 లక్షలుగా తేల్చారు. అందులో 6.46 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని 5.92 లక్షల ఎకరాలను 4లక్షల,79 వేలమందికి పంపిణీ చేసినట్లు పాలకులు లెక్క లు చెబుతున్నారు. దీన్ని గమనిస్తే భూసంస్కరణల చట్టం ఎంత బూటకంగా అమలు జరిగింది తెలుస్తున్నది.

Assigned lands

కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలు

చంద్రబాబునాయుడు భూసంస్కరణలకు, చిన్న రైతుల వ్యవసాయానికి వ్యతిరేకం. వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. దాన్ని ఆచరణలో పెట్టడానికే లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలుఅమలు చేస్తున్నారు. ఆ విధంగా రాష్ట్రంలో కార్పొరేట్, కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ముమ్మరం చేయ చూస్తున్నారు. లీజుకి తీసు కున్న భూముల్లో తమ ఇష్టం వచ్చిన పంటలను కార్పొరేట్లు పండిస్తారు. ఫలితంగా ఆహార పంటల కొరత ఏర్పడుతుంది. ఏదేశమైనా. రాష్ట్రమైనా భూసంస్కరణలు అమలు జరప కుండా పారిశ్రామిక అభివృద్ధిని సాధించలేవు. రాష్ట్రంలో భూసంస్కరణల అమలు బూటకంగా మారి పేదలకు భూమి దక్కలేదు. భూసంబంధాల్లో మౌలికమైన మార్పులురాలేదు. పాలక ప్రభుత్వాలు పేదలకు భూములు పంచకుండా, అసైన్డ్ భూములు, నిషేధిత భూములు, చిన్న, సన్నకారు రైతుల భూములుకార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలు అమలు చేస్తున్నది. కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టే రాష్ట్రం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ, లక్షలాది ఎకరాల అసైన్డ్భూములు, నిషేధిత 22ఎ భూములు, మిగులు భూములు, అటవీ బంజరు భూములు పేదలకు పంపిణీ చేయాలని గ్రామీణ పేదలు, పేద రైతులు ఉద్యమించాలి.
– బొల్లిముంతసాంబశివరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Assigned Lands Breaking News Corporates Government Policy Land Allocation Land Issues latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.