📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu:Assembly-అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యేలు..జీరో అవర్లో ప్రభుత్వం దృష్టికి పలు అంశాలు

Author Icon By Sharanya
Updated: September 25, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: శాసనసభ ప్రశ్నోత్తరాలు జీరో అవర్ లో పలువురు సభ్యులు వివిధ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నారు. టీడ్కో ఇళ్ళు(Teedco Homes), రెవెన్యూ, విద్య, వైద్యం, రహదారులు, గ్రామీణ ఆరోగ్యం ఇతరంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని అంటే ఆయా మంత్రులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. సమస్య తీవ్రతను వారికి తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పీఆర్సీపై ప్రతిపక్ష సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి వేతన సవరణపై ప్రశ్నించారు. వీరు సభకు రావడంతో సమాధానం వాయిదా వేసారు.

News telugu

ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ

చంపావతి నది నీటి వినియోగంపై శాసన సభ్యురాలు పూనపాటి ఆదితి విజయలక్ష్మి, నూతన బాలికా సంరక్షణ పధకం(Girl Child Welfare Scheme)పై ఆదిరెడ్డి శ్రీనివాస్, జీవీఎంసీలో రహదారిపై కొణతాల రామకృష్ణ, ప్రజాసమస్యల పరిష్కారంపై దూళిపాళ్ళ నరేంద్రకుమార్, కూన రవికుమార్ తదితరులు ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్అండ్బి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, నిధులు వచ్చినా విడుదల చేయడం లేదని, దీనివల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అసెంబ్లీలో అధికారపక్ష సభ్యులు తెలిపారు. రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కొన్నిచోట్ల పనులు చేసినా డబ్బులు ఇవ్వకపోవడంతో మిగిలిన పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలిపారు.రోడ్లపై వాహనాలు తిరగాలంటే ఇబ్బందిగా ఉందని, ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని చెప్పారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రోడ్లను వెంటనే బాగు చేయించాలని కోరారు. వెంటనే నిధులు విడుదల చేయించాలని కోరారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహానా బాషా మాట్లాడుతూ తన నియోజకవర్గంలో తాగునీరు సమస్య ఉందని అన్నారు. ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉందనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ ఉత్తర బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ అంధ్రా యూనివర్శిటీ పరిధిలో 18 పోస్టులు తాత్కాలికంగా నియమించారని, వారిని పర్మినెంటు చేయాలని కోరితే లోకేష్ కార్యాలయం చెబితేనే చేస్తామంటున్నారని అన్నారు. దీనిపై విద్యా శాఖ మంత్రి లోకేష్ స్పందించి వారి నియామకాలు పూర్తి చేయాలని కోరారు.

నల్లబర్లీ పొగాకు 2,200 టన్నులు కొనుగోలు

చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ నల్లబర్లీ పొగాకు 2,200 టన్నులు కొనుగోలు చేశారని, ఇంకా రైతుల వద్ద పెండింగ్లో ఉందని తెలిపారు. కొనుగోలు విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో 20 క్వింటాళ్లకు పైబడి పొగాకు పండించిన రైతుల వద్ద పత్తి నిలిచిపోయిందని తెలిపారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని ఎల్లన్నపేట మండల పరిధిలో ఇప్పటికీ పోలీసుస్టేషన్ లేదని, నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్లేదని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగితే ఒడిశా ఫైరింజర్లు వస్తున్నాయని తెలిపారు. జక్కంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పంచాయతీరాజ్ కార్మికులకు జీతాలు పెంచకుండా వారి శ్రమను దోచుకుంటున్నామని అన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన కాళహస్తి దేవాలయం పరిధిలో ఆస్పత్రి లేదని, అక్కడ ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని దేవాలయానికి అనుబంధం చేయాలని తెలిపారు. బొబ్బిలి ఎమ్మెల్యే ఎర్విఎస్కె రంగారావు మాట్లాడుతూ గతంలో అసెంబ్లీలకు నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ ఉండేదని, దాన్ని పునరుద్ధరించాలని కోరారు. దీనికి పలువురు సభ్యులు బల్లలు చరిచి తమ మద్దతు ప్రకటించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తన అభిప్రాయం కూడా అదేనని, గతంలో నిధులు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలందరూ సిఎంని కలిసి దీనిపై ఒప్పించుకుని నిధులు రాబట్టుకోవాలని కోరారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాదు మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలు మునిగిపోతున్నాయని, వాటిని మెరక చేయించాలని, గృహ నిర్మాణశాఖ మంత్రిని కోరారు. కావలి ఎమ్మెల్యే దుగమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో కాలువలు సరిగాలేక పొలాలు నీట మునుగుతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా మాట్లాడారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Assembly assembly Breaking News Government Response latest news Legislative Session MLAs Public Issues Telugu News Zero Hour

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.