ఏపీ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులపై వేడివేడి చర్చ ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాజకీయ కక్షపూరిత కేసులు పెద్ద చర్చకు దారి తీశాయి. Assembly గత ప్రభుత్వ కాలంలో పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలని జనసేన ఎమ్మెల్సీ MLC నాగబాబు మండలిలో డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం “2019 నుండి ఇప్పటి వరకు నమోదైన తప్పుడు కేసులను కూడా ప్రభుత్వం రద్దు చేయాలి” అని సూచించారు.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ, “యేసురత్నం గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారు. ఆయనే పెట్టిన తప్పుడు కేసులు బయటకు తేవాల్సిందే” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, గత ఐదేళ్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అనవసర కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. Assembly “మా మీద గొడ్డలివేటు, తల్లి–చెల్లి కేసులు లేవు” అంటూ ఆమె స్పష్టం చేశారు.
Assembly
ఇక ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “హోంమంత్రి అనిత అనవసరమైన విషయాలు చెబుతున్నారు. 16 నెలలు గడిచినా ఇంకా గత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేస్తూ పరిమితమవుతున్నారు” అని విమర్శించారు. ఆయన నిరసనగా వాకౌట్ కూడా చేశారు.
ఏపీ శాసనమండలిలో ఏ అంశంపై చర్చ జరిగింది?
రాజకీయ కక్షపూరిత కేసులపై వేడివేడి చర్చ జరిగింది.
జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఏం డిమాండ్ చేశారు?
గత ప్రభుత్వంలో పెట్టిన రాజకీయ కక్షపూరిత కేసులను ఎత్తేయాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: