ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 14న వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Read Also:AP HousingScheme: ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు
18–21 రోజుల పాటు సభ నిర్వహణ
బడ్జెట్ సమావేశాలను సుమారు 18 నుంచి 21 రోజుల పాటు(Assembly) నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే సమావేశాల కాలాన్ని పొడిగించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ సమావేశాలు మార్చి రెండో వారం వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
తొలి రోజు గవర్నర్ ప్రసంగం
సభ ప్రారంభమైన తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించనున్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యాలు, రానున్న కాలంలో అమలు చేయబోయే కార్యక్రమాలపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం
అదే రోజు శాసనసభ(Assembly) బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సభ నిర్వహణ తేదీలు, చర్చించాల్సిన అంశాలు, బిల్లుల షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. బడ్జెట్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉండటంతో పాటు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై తీవ్ర వాదనలు జరగనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: