విజయవాడ : బెంగళూరు నుంచి కడప వరకు కొత్త రైల్వే మార్గం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో (Ashwini Vaishnaw) ఢిల్లీలో సమావేశమై కోరారు. ఈ భేటీలో ఎంపి పురందేశ్వరి, అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు-కడప రైల్వే మార్గం ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలోనే సాధ్యం అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన ఈ రైల్వే మార్గాన్ని త్వరితగతిన మంజూరు చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
Read also: Andhra Pradesh: ద్వారకా తిరుమలలో కల్తీ నెయ్యి కలకం
Establish a Bangalore-Kadapa railway line
కడప విమానాశ్రయం నుంచి విమాన సేవల విస్తరణపైనా కడప విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాల సేవలను పెంపొందించాలని కోరుతూ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకుసాగుతున్న క్రమంలో, కడప విమానాశ్రయం ద్వారా కడప జిల్లాకు మెరుగైన విమాన కనెక్టివిటీ కల్పిస్తే రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, వ్యాపార, పర్యాటక రంగాల పురోగతికి దోహదపడుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.
ఎపిని క్రీడా హబ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతీయ యువజన వ్యవహారాలు, ఎస్ఏఐ జాయింట్ సెక్రెటరీ వినీల్ కృష్ణతో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాయచోటి నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన నిధులు, ఖేలో ఇండియా పథకం కింద ప్రతిపాదనల ఆమోదం, అలాగే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రశ్రేణి క్రీడా హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు నిధుల మంజూరు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: