📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News :artificial rain: కృత్రిమ వర్షం కురిసేనా! కాలుష్యం తగ్గేనా?

Author Icon By Sudha
Updated: October 31, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం తీవ్రమైన వాతావరణ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతి సంవత్స రం చలికాలం ప్రారంభంలో, ముఖ్యంగా దీపావళి పండుగ తర్వాత, ఢిల్లీఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఎక్యూఐ) ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆనవాయితీగా మారింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడం వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలు వంటి తీవ్ర అనారో గ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ వంటి సంస్థల సహకారంతో ‘క్లౌడ్ సీడింగ్’ పద్ధతి ద్వారా కృత్రిమ వర్షం(artificial rain) కురిపించేందుకు సిద్ధమైంది. నిజానికి దేశంలో క్లౌడ్ సీడింగ్ ప్రయోగాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రాం తాలలో నీటి కొరత, కరువు నివారణకు ఇటువంటి ప్రయో గాలు జరిగాయి. వాటి ఫలితాలు సందర్భాన్ని బట్టి మారు తూ వచ్చాయి. కొన్ని ప్రదేశాలలో ఈ పద్ధతి ద్వారా వర్ష పాతం పెరిగినట్లు నివేదించగా, మరికొన్నింటిలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుతం ఢిల్లీలో దీనిని ముఖ్యంగా ‘కాలుష్య నివారణ’ అనే విభిన్న లక్ష్యంతోచేపడుతున్నారు. దీని ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూ స్తోంది. క్లౌడ్ సీడింగ్ అనేది వాతావరణ పరివర్తన సాంకేతికతలో ఒక భాగం.

Read Also: http://Air pollution : ఢిల్లీలో వాయు కాలుష్యం .. 75 శాతం కుటుంబాల్లో వైరల్‌ ఇన్ఫెక్షన్లు..

artificial rain

క్లౌడ్ సీడింగ్ ప్రయోగం

వర్షం పడడానికి అవసరమైనంత తేమ మేఘాలలో ఉన్నప్పటికీ, బిందువులు ఘనీభవించ డానికి లేదా బరువుగా మారడానికి సహజ కణాలు లేన ప్పుడు ఈ పద్దతిని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో, విమానం లేదా ప్రత్యేక సాధనాల ద్వారా సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ లేదా పొటాషియం అయోడైడ్ వంటి రసాయన ఉత్ప్రేరకాలను అనువైన మేఘాలలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలు మేఘాలలో తేమతో కూడిన కణాలకు కేంద్ర బిందువులుగా పనిచేసి, నీటి బిందువులు వేగంగా పెరిగేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా, సిల్వర్ అయోడైడ్ మంచుస్పటికాల నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇది అతిశీతలీకరణ ద్రవ నీరు (సూపర్ కూల్డ్ లిక్విడ్ వాటర్) ఉన్న మేఘాలలోకి వెళ్లి, నీటి బిందువులను గడ్డకట్టించి, వాటిని బరువైన మంచు స్ఫటికాలుగా లేదా నీటి బిందువులుగా మారుస్తుంది, తద్వారా చివరకు వర్ష రూపంలో నేలపై పడేలా చేస్తుంది. ఢిల్లీలో కాలుష్య కణాలను కడిగివేయడానికి కృత్రిమ వర్షాన్ని(artificial rain) కురిపించడం కోసం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ప్రధాన ఉద్దేశం కాలు ష్యాన్ని తొలగించడమే. కృత్రిమ వర్షంద్వారా గాలిలో ప్రమాదకర స్థాయిలో పేరుకుపోయిన పిఎం 2.5, పిఎం 10 వంటి సూక్ష్మ కాలుష్య కణాలను నేలపైకి రప్పించి గాలి నాణ్యతను తాత్కాలికంగా మెరుగుపరచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈప్రయోగం విజయవంతం కావాలంటే అనేక సవాళ్లను అధిగమించాలి. ప్రధానంగా, కృత్రిమ వర్షాన్ని ప్రేరేపించడానికి మేఘాలలో కనీసం 50 శాతం తేమ ఉండాలి. వాతావరణంలో తేమ శాతం తక్కు వగా ఉంటే రసాయనాలను విడుదల చేసినా వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గతంలో ఈప్రయో గం వాయిదా పడటానికి వాతావరణంలోని ఈ అనుకూలత లోపమే ముఖ్య కారణం. అంతేకాకుండా, కేవలం అనువైన మేఘాలు సరైన ఎత్తులో ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడే ఈ ప్రక్రియ పనిచేస్తుంది. ఐఐటీ కాన్పూర్ వంటి సంస్థలు కృషి చేస్తున్నప్పటికీ వాతావరణ అనిశ్చితి, సరైన సమన్వ యం ఈప్రయోగ ఫలితాలను ప్రభావితం చేస్తాయి.

artificial rain

తాత్కాలిక ఉపశమనామ్

క్లౌడ్ సీడింగ్ కాలుష్య సమస్యకు ఒక తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలదు, కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. కాలుష్య మూల కారణాలైన వాహనాల ఉద్గారాలు, పారిశ్రా మిక వ్యర్థాలు, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడం వంటి సమస్యలను కఠినంగా అరికట్టడం ద్వారా మాత్రమే ఢిల్లీ కాలుష్యాన్ని దీర్ఘకాలంలో నియం త్రించగలం. అంతే తప్ప, ప్రతి సంవత్సరం కృత్రిమ వర్షం పై ఆధారపడటం ఆర్థికంగా, పర్యావరణపరంగా స్థిరమైన పరిష్కారం కాదు. అంతేకాకుండా ఈ ప్రక్రియలో ఉపయో గించే సిల్వర్ అయోడైడ్ వంటి రసాయనాల దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాలపై అనేక ఆందోళనలు ఉన్నాయి. ఈ రసాయనాలు మట్టి, నీటి జరగాల్సిన అవ సరం ఉంది. కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఈ రసాయనాల స్థాయిలు ప్రమాదకరంగా లేనప్పటికీ వాటి నిరంతర వాడకం వలనపర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్రయోగం అనేది దేశ రాజధాని ఎదుర్కొంటున్న తీవ్రమైన కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించ డానికి జరుగుతున్న ఒక నిస్సహాయ ప్రయ త్నంగా చూడవచ్చు. ఇది ఒక వైపు మన సాంకేతిక సామ ర్థ్యాన్ని సూచిస్తున్నప్పటికీ, మరొక వైపు కాలుష్య నియంత్ర ణలో మన వ్యవ స్థాగత వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపు తోంది. గతంలో నీటి కొరత కోసంజరిగిన ప్రయోగాల ఫలితాలు ఢిల్లీ కాలుష్య సమస్యకు పూర్తి హామీ ఇవ్వలేక పోవచ్చు. కాలుష్యం అనేది ఒక బహుముఖ సమస్య, దీనికి కేవలం తాత్కాలిక మార్గాలను కాకుండా, ప్రభుత్వం, పౌరు లు, పరిశ్రమలు చిత్తశుద్ధితో పనిచేసి, ఉద్గారాలను తగ్గిం చడం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం, పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలుచేయడం వంటి శాశ్వతపరిష్కారాలవైపు దృష్టి సారించాలి. క్లౌడ్సీడింగ్ వంటి పద్ధతులు అత్యవసర పరిస్థితుల్లో ఉపశమనం కోసం మాత్రమే ఉపయోగపడాలి. అయితే, ఆరోగ్యకరమైన భవి ష్యత్తు కోసం, కాలుష్యం లేని పర్యా వరణాన్ని నిర్మించుకో వడమే మనందరి ముఖ్య లక్ష్యం కావాలి.

డి.జె మోహన్ రావు

కృత్రిమ వర్షం అంటే ఏమిటి?

మేఘాలలో తేమ సంగ్రహణను వేగవంతం చేసి వర్షం కురిపిస్తుంది . ఉప్పు కణికలు మంచు-న్యూక్లియేటింగ్ కణాలుగా పనిచేస్తాయి, ఇవి మేఘాలలో మంచు స్ఫటికాలు ఏర్పడటానికి వీలు కల్పిస్తాయి. అప్పుడు మేఘాలలోని తేమ ఈ మంచు స్ఫటికాలకు అంటుకుని వర్షంగా ఘనీభవిస్తుంది.

కృత్రిమ వర్షం మంచిదా చెడ్డదా?

ఐఐటీ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ సాగ్నిక్ డే, కృత్రిమ వర్ష ప్రణాళికను ” నిలకడలేనిది మరియు దీర్ఘకాలిక పరిష్కారం కాదు ” అని అభివర్ణించారు. “ఇది ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. ఇది తాత్కాలికంగా కాలుష్యాన్ని తగ్గించినప్పటికీ, ఢిల్లీలో, [వాయు కాలుష్యం] తిరిగి రావడం చాలా వేగంగా ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Artificial Rain Breaking News delhi environment latest news pollution Telugu News Weather Modification

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.