📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Artificial intelligence : ఎఐతో భాషాభివృద్ధి సాధ్యమేనా?

Author Icon By Sudha
Updated: November 20, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చక్రం పురాతన ఆవిష్కరణ. కొత్త రాతి యుగంలో మెసెప్పుటోమియన్లు కనుగొన్నారు. రవాణాకు చక్రం, ఇరుసులే ముఖ్యం. ఈ రెండు వాళ్ళ సృష్టే. ఇవి రవాణా గతినే మర్చివేసాయి. ప్రగతి చక్రాన్ని ఫర్ మని త్రిప్పాయి. ఆవిరి, ముద్రణా యంత్రాలు సమాజాన్ని మరింత ముందు కు తీసుకెళ్ళాయి. విద్యుత్, కంప్యూటర్ కనుగొన్నాక అభివృద్ధి ఊహకు అందని తీరాలకు చేరింది. గుండు సూది మొదలు కంప్యూటర్ వరకు ప్రతి ఆవిష్కరణ మానవ జీవితాన్నిఎంతో వేగవంతం చేసాయి. తేలిక పరిచాయి. అధిక సుఖమయం కావించాయి. అయినప్పటికి ఈ మార్పులు మధ్య ఒక మానవ అనుభవం మాత్రం ఏమాత్రం మార్పు లేకుండా అలాగే నిశ్చలంగా నిలిచి వుంది. అది భాష. భావాన్ని వ్యక్తం చేసేదే (సాధనం) భాష. తొలినాళ్లలో దూరంగా ఉన్నవారికి సమాచారం అందించడానికి దూతను పంపేవారు. తరువాత ఉత్తరం వచ్చింది. ఫోన్ దూరాన్ని చేరిపేసింది. అదనంగా మెయిల్, వాట్సాప్, ఇలా మెసేజ్ చేసే సాధనాలు చాలా వచ్చాయి. నేరుగా మాట్లాడడానికి వీడియో కాల్స్ అందుబాటులో వున్నాయి. ఎన్ని సాధనాలు వచ్చినా భాష మారలేదు. అలానే వుంది. అప్పుడు, ఇప్పుడు ఇద్దర్ని కలిపేది మాటే. సాధనాలు మారాయి. అంతే కానీ ప్రేరణ అలానే నిలిచివుంది. కృత్రిమ మేధా (Artificial intelligence)ఇప్పుడు నేర్చుకోవడం, పని పద్ధతులను తిరిగి రాస్తోంది. ఇది గణిత సమీకరణాలను పరిష్కరిస్తోంది. వ్యాసాలు రచిస్తోంది, సంగీత బానీలు కడుతోంది. ఇలా ఎన్నో చేస్తున్నది. ఈ మేధా ట్యూటరుగా, అనువాదకునిగా, ఆశ్చర్యకరంగా ఒక సహచరునిగాను వ్యాహరిస్తున్నది. తర్కం, స్థిర వ్యస్థలపై నిర్మితమైన లెక్కలు, ఇంజనీరింగ్ తదితర శాస్త్ర విషయాలు ఇప్పటికే రూపాంతరం చెందాయి. సంక్లిష్ట సైన్స్ సూత్రాల వివరాలు ఇప్పుడు ఎఐ (Artificial intelligence) ద్వారా తక్షణమే ఎవరైనా పొందవచ్చు.

Read Also : Tirumala: పరకామణి చోరీపై త్వరలో మరో కేసు

Artificial intelligence

ఒక భాష ఆ జాతి జీవన శ్వాస

భాష వేరే కోవకు చెందింది. దీనికి నియమాలు ఉం టాయి. అంతేకాకుండా ఒక భాష ఆ జాతి సంస్కృతి, భావోద్వేగాల జీవన శ్వాస. ఎఐ వ్యాకరణాన్ని, పదజాలాన్ని వివ రించగలదు. కానీ హాస్యం, వ్యంగ్యం, ప్రేమలు పట్టుకోలేదు. యంత్రం సాయంతో చేసిన అనువాదంసరిగానే ఉంటుంది. ఐతే దీనిలో హృదయం లోపిస్తుంది. ఎవరైనా ఒకరు ‘ఐమిస్ యు’ అంటే, దానిలో భావోద్వేగం ఇమిడి ఉంటుంది. యంత్రం ఆ ఉద్వేగ అనుభూతి చెందదు కదా! టెక్నాలజీ అనువాద క్రియను చాలా సులువు చేసింది. తెలుగు ఉత్త రమో, వ్యాసమో కేవలం క్షణాల్లో తప్పులు లేకుండా ఎఐ మరో భాషలోకి అనువదిస్తుంది. అది కచ్చితంగా ఉంటుంది. కానీ పేలావం అనిపిస్తాయి. మనిషి మాటలో వినిపించే పలు స్వరాలు, లయ, మాధుర్యాలు వినిపించవు. అను వాదం అంటే ఒక భాష నుండి మరో భాషలోకి తర్జుమా మాత్రమే కాదు కదా! అనువాదం అంటే విషయంలోకి పరకాయ ప్రవేశం చేసి అందించడం. అందుకే భాష భిన్న మైందని భాషవేత్తలు చెబుతారు. సైన్స్ఫార్ములా తెలుసు కోవడం ఓ వియుక్త నైపుణ్యం. మాట్లాడటమే భాష. మాట లో, నవ్వులో, స్వరంలో అనేక భావాలూ ఉంటాయి. అలోచన చెప్పడంలో పొరపడి, జాగ్రత్తగా దిద్దుకోంటాం. ఇవి అన్నీ చిన్న చిన్న విషయాలనిపిస్తాయి. తీపి, చేదు అనుభూతులు కలిగిస్తాయి. ఇవన్నీ విశ్వాసం పెంపొందిస్తా యి.
ఒకరితో ఒకరిని కలుపుతాయి. ఎందరో గురువులను అందిస్తుంది. ఈ బంధం భాష నేర్చుకోవడంలో మెలుకు వలు తెలియజేస్తుంది. ఈ సజీవ శిక్షణ ఏ యాప్, చాట్ బోట్లు మనకు అందించగలవు.

ఇంగ్లీష్ తప్పని సరైంది

కృత్రిమ మేధో సాధనాలు పలు రకాలుగా సాయపడతాయి. అవి పలుకుబడి సరిచేస్తా యి. వ్యాకరణం వివరిస్తాయి. ఇంకా వ్యక్తిగతీకరించిన అభ్యా సన్ని అందిస్తాయి. టీచర్లకు బాగా ఉపయోగపడతాయి. లెసన్ ప్లాన్ రాసుకోవచ్చు, విద్యార్థులు నుండి వేగంగా అభిపాయాలూ సేకరించవచ్చు. ఎదుటి వ్యక్తి మాటల్లోని భావోద్వేగాన్ని అర్థం చేసుకోనే ప్రయత్నాన్ని యంత్రాలు భర్తీ చేయలేవు. భాషా పటిమ ధారళంగా మాట్లాడడం ద్వారా రాదు. సహా నుభూతి ద్వారానే అలవడుతుంది. సజీవ భాషలు నిరంతరం అభివృద్ధి చెందుతూనేఉంటాయి. యాస, మర్యాద పూర్వక సంభషణా స్వరాలు మెల్లగా అనుభవంతో మారుతాయి. యంత్రం వీటిని నమోదు చేయగలదు. కానీ మనిషి కాదు కదా! కనుక అది మన మాటల లాయలో పాల్గొనలేదు. విన డం, అర్థం చేసుకోవడం, తగిన విధంగా ప్రతిస్పందించడం నిరంతర తర్ఫీదు. ఇదే నిజమైన భాష ప్రావీణ్యత సాధనా మార్గం. గత మూడు దశాబ్దాలుగా పట్టణీకరణ జోరక్కెంది. ఆంగ్ల మాధ్యమ కాన్వెంట్ చదువులు బాగా పెరిగాయి. ఉపాధి అవకాశాలు అందిపుచుకోవాలంటే ఇంగ్లీష్ తప్పని సరైంది. నేడు ఏ భాషనైనా ఎఐ పరికరాల సాయంతో అనువదించడం చాలా సులువైంది. కష్టం లేకుండా చేస్తు న్నది టెక్నాలజీ. ఇదే పెను ముప్పు కలిగిస్తుంది. భాష నేర్చు కోవలసిన అవసరంలేదనే భావన మనలో నాటుతుంది. అందుకే టెక్నాలజీని నేర్పు, వాడాలని భాషా శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భాష నేర్వడం అంటే పదవినియోగం అను కుంటే పొరపాటు. ఈ ప్రపంచాన్ని మరో దృష్టికోణంతో దర్శించడం. భాష నెమ్మదిగా వంటబడుతుంది. ఇలా నేర్చుకోవడంలో భావోద్వేగం, మానవతలు మిళితమైవుంటాయి. ఇదే నిజ భాషా పండిత్య సాధనకు సోపానం.
– వి. వరద రాజు

కృత్రిమ మేధస్సు స్థాపకుడు ఎవరు?

కృత్రిమ మేధస్సు – మెషిన్ ఇంటెలిజెన్స్జాన్ మెక్కార్తీ అనే పదాన్ని సృష్టించడం మరియు ఈ రంగం అధికారికంగా జన్మించిన 1956 డార్ట్మౌత్ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా కృత్రిమ మేధస్సు స్థాపకుడిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. అయితే, AI అభివృద్ధి అలాన్ ట్యూరింగ్, మార్విన్ మిన్స్కీ, అల్లెన్ న్యూవెల్ మరియు హెర్బర్ట్ ఎ. సైమన్ వంటి ఇతరుల నుండి పునాది పనితో సహకార ప్రయత్నం.

AI కి CEO ఎవరు?

సామ్యుయేల్ హారిస్ ఆల్ట్మాన్ (జననం ఏప్రిల్ 22, 1985) 2019 నుండి ఓపెన్ఏఐ కి అమెరికన్ వ్యవస్థాపకుడు, పెట్టుబడిదారుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అతను AI బూమ్ యొక్క ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AI technology Artificial intelligence Breaking News Language Development latest news Linguistics Tech Innovation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.