📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

artificial intelligence: ఆలోచనకు అవరోధంగా కృత్రిమ మేధ

Author Icon By Sudha
Updated: February 6, 2026 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) నేటి విద్యారంగంలో అని వార్యమైన అంశంగా మారుతోంది. సాంకేతిక సౌలభ్యాల పేరిట ఇది పాఠశాలస్థాయిలో కూడా వేగంగా ప్రవేశిస్తోం ది. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కేవలం పాఠ్యపుస్తక జ్ఞానం అందించే దశకాదు. అది పిల్లల ఆలోచనాశక్తి, వ్యక్తి త్వం, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను నిర్మించే అత్యంత కీలకమైన దశ. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల సందర్భంలో ఎఐ నియంత్రణలేకుండా ప్రవేశిస్తే, విద్యలో సమానత్వం, నాణ్యత, లక్ష్యసాధన అన్నవే తీవ్రంగా దెబ్బ తింటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎఐ ఆధారిత అభ్య సనం పిల్లల ఆలోచనా శ్రమను తగ్గిస్తూ, సిద్ధంగా ఉన్న సమాధానాలపై ఆధారపడే అలవాటును పెంచుతోంది. ఈ ప్రభావం ప్రాజెక్ట్ వర్క్స్, హోమ్ వర్క్ వంటి కీలక అభ్య స విధానాల్లో మరింత తీవ్రంగా కనిపిస్తోంది. ప్రాజెక్ట్ వర్క్స్ విద్యార్థిలో పరిశోధనా దృష్టి, సమాచార సేకరణ నైపుణ్యం, స్వయంగా ఆలోచించి నిర్ణయించుకునేశక్తి, ప్రదర్శనా సామద్యాన్ని పెంపొందించేందుకు రూపొందించబడ్డాయి. కానీ ఎఐ ఆధారిత కంటెంట్ సులభంగా లభించడం వల్ల ప్రాజెక్ట్వర్క్ అసలు ఉద్దేశ్యం నశిస్తోంది. పిల్లలు సమస్యను అర్థం చేసు కోవడం, పుస్తకాలు తిరగేయడం, ఉపాధ్యాయులతో చర్చించ డం వంటి దశలను దాటేసి, సిద్ధంగా ఉన్న సమాచారం కాపీ చేసి సమర్పిస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ వర్క్ ఒక అభ్యాస సాధనంగా కాకుండా, మార్కుల కోసం పూర్తి చేయాల్సిన యాంత్రిక పనిగా మారుతోంది. ఇది విద్యార్థి మేధో వికాసానికి తీవ్రనష్టం కలిగిస్తోంది. భాషాభ్యసనం విషయంలో ఈ ప్రభావం మరింత ప్రమాదకరం. ప్రభుత్వ పాఠశాలల్లో చదు వుతున్న అనేక మంది పిల్లలకు పాఠశాలే భాషాభ్యాసానికి ప్రధాన వేదిక. కానీ ఎఐ తయారు చేసిన వ్యాసాలు, పేరా గ్రాఫ్లు, సమాధానాలపై ఆధారపడటం వల్ల పిల్లలు స్వయం గా వాక్యాలు నిర్మించే అవకాశాన్ని కోల్పోతున్నారు. భాషా వేత్త చెప్పినట్లుగా, భాష మన ఆలోచనలను నిర్మిస్తుంది. దానిని యంత్రాలకు అప్పగిస్తే ఆలోచనలే యాంత్రికమవు తాయి. స్కూల్ దశలోనే ఈపరిస్థితి ఏర్పడితే, భావవ్యక్తీ కరణలో పిల్లలు జీవితాంతం బలహీనులుగా మిగిలే ప్రమా దం ఉంది. గణితం, సైన్స్వంటి సబ్జెక్టలో ఎఐ ప్రభావం మరింత లోతుగా ఉంది. గణితం ద్వారా పెంపొందించా ల్సిన తార్కిక ఆలోచన, దశలవారీ సమస్య పరిష్కార నైపు ణ్యం ఎఐ నేరుగా సమాధానాలు ఇవ్వడం వల్ల క్రమంగా తగ్గిపోతోంది.

Read Also : http://Elon musk: అంతరిక్షంలో డేటా సెంటర్లు..మస్క్ కొత్త ప్లాన్!

artificial intelligence

ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నట్లు, విద్య అనేది సమ స్యలకు సమాధానాలు తెలుసుకోవడం కాదు, ఎలా ఆలో చించాలో నేర్చుకోవడం. సైన్స్ విషయంలో కూడా ప్రయో గాలు, పరిశీలన, ప్రశ్నించే అలవాటు స్థానంలో స్క్రీన్ ఆధారిత సమాచారం వచ్చి చేరుతోంది. సోషల్ స్టడీస్లోనూ ఇదే పరిస్థితి. చరిత్ర, సివిక్స్, భూగోళం వంటి అంశాల ద్వారా పిల్లల్లో సామాజిక చైతన్యం, పౌరబాధ్యత పెంపొం దించాల్సిన అవసరం ఉంది. కానీ ఎఐ ఆధారిత సంక్షిప్త నోట్స్ వల్ల సంఘటనలపై లోతైన విశ్లేషణ జరగడం లేదు. ఎఐ ప్రభావం విద్యార్థులకే పరిమితం కాకుండా ఉపాధ్యా యుల బోధనా నాణ్యతపై కూడా తీవ్ర ప్రభావం చూపు తోంది. కొంతమంది ఉపాధ్యాయులు ఎఐ తయారు చేసిన నోట్స్, ప్రశ్నాపత్రాలు, వివరణలపై అధికంగా ఆధారపడు తూ స్వయంగా అధ్యయనం చేసే అలవాటును కోల్పోతు న్నారు. బోధనలో సృజనాత్మకత, చర్చ, అనుభవాధారిత విధానాల స్థానంలో రెడీమేడ్ కంటెంట్ వినియోగం పెరుగు తోంది. దీనివల్ల ఉపాధ్యాయులు క్రమంగా పేలవంగా తయా రవుతూ, విద్యార్థుల ఆలోచనలను ప్రేరే పించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. డా.ఏ.పీ.జే. అబ్దుల్ కలాం అన్నట్లుఉత్తమ గురువు విద్యార్థిలో ప్రశ్నలను పుట్టిస్తాడు, సమాధానాలు కాదు. కానీ ఎఐ ప్రశ్నలను తగ్గించి, సమాధానాలనే ముం దుంచుతోంది. హోమ్వర్క్ విషయంలో ఎఐ మరింత పెద్ద సమస్యగా మారింది. విద్యార్థి స్వయంగా హోమ్వర్క్స్చేశాడా, లేక ఎఐ ఆధారంగా తయారుచేశాడా అన్నది ఉపాధ్యాయు లు స్పష్టంగా నిర్ధారించలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి బలం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి విద్యార్థి పనిని లోతుగా పరిశీలించే అవకాశం ఉపాధ్యాయులకు ఉండడం లేదు. ఫలితంగా నిజంగా కష్ట పడే విద్యార్థి, ఎఐ ఆధారంగా పనిచేసిన విద్యార్థి ఒకే స్థాయి లో నిలబడుతున్నారు. ఇది క్రమంగా నిజాయితీ విలువలను దెబ్బతీస్తోంది. ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యే పరిస్థితి తల్లిదండ్రుల విద్యాస్థాయి తక్కు వగా ఉన్న కుటుంబాల్లో కనిపిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) విద్యకు సహాయ కుడు కావాలి గానీ, ప్రభుత్వ పాఠశాలల విద్య లక్ష్యాలను దారి తప్పించే శక్తిగా మారకూడదు.
-మర్రాపు వసుంధరా దేవి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AI impact Artificial intelligence Breaking News digital age human thinking latest news technology influence Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.