📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : Arogyashri : ఆరోగ్యశ్రీ సేవలకు అనారోగ్యం!

Author Icon By Sudha
Updated: October 14, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ లేదా ఆరోగ్యశ్రీ రోగుల సేవలకు ఆయా ఆరోగ్య సంస్థలు మొండికేస్తున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీలకు లోబడి తమకు గిట్టుబాటు కాకున్నా అన్ని ఆరోగ్యసేవలను సజావుగా చేస్తూ ‘మేముసైతం’ అనుకుంటున్న కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం నుంచి బకాయిలు అందడం లేదు. తమ వద్దకు నేరుగా వచ్చే రోగులకు తాము నిర్దేశించుకున్న మేరకు ఫీజులు, వైద్యసేవలు వగైరా ఎంతయినా తీసుకోవచ్చు. దాని మీద ఎలాంటి అదుపు లేదు. కానీ ప్రభుత్వం కేటాయించిన ఉద్యోగులకు, జర్నలిస్టులకు దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల కోసం ప్రత్యేకించి ప్రభుత్వం అందచేస్తున్న ఏరకమైన కార్డులైనా ప్రభుత్వ నిర్దేశిత ప్యాకేజీ మాత్రమే బిల్లింగ్ చేయాలి. అంతకన్నా పైసా ఎక్కువ వసూలు చేయరాదు. ఆ బిల్లులు అందచేసిన తర్వాత ఎప్పటికో కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయదు. దాంతో కార్పొరేట్ఆస్పత్రులు నడిపేందుకు నిధుల్లేవని డీలా పడిపోతున్నాయి. చివరాఖరుకు తాము పేదల వైద్యానికి దూరమని తేల్చి చెప్పేస్తున్నాయి. వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్యసేవ అని ఏ పేరిట అందిస్తున్నా చికిత్సల బిల్లుల విషయంలో 800 కార్పొరేట్ ఆస్పత్రులు ఇప్పుడు సత్వర వైద్యానికి ‘నో’ చెబుతున్నాయి. ఒకసారి బకాయిపడితే అధికార వర్గం కొంత కాలం వ్యవహారాన్ని సాగతీయడం, ఆపైన ఎంతో కొంత చెల్లింపుల కోసం నిధులు విడుదల చేస్తుంటాయి. ఈ విధమైన తాత్సారంతో కార్పొరేట్ ఆస్పత్రులు అడకత్తెరలో పోకచెక్క చందాన ఆర్థిక వెసులుబాటు లేక నలిగిపోతున్నాయి. ఆయా కార్డుల మీద రోగులకందించే వైద్యసహాయానికి ఆస్పత్రుల వారు బిల్లు అందించిన 45 రోజుల్లోగా ప్రభుత్వం బిల్లు పేమెంట్ చేయాలన్న ఒప్పందం ఉన్నా దాని ప్రకారం నిధులు అందించడంలో వెనుకడుగు వేస్తున్నందున ఇలాంటి సమస్య పుడుతోంది. ప్రభుత్వ నిర్దేశిత ధరలకే వైద్య చికిత్సలు అందివ్వడంలో కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే ఆర్థిక లబ్ధిఏమీ ఉండదు. అయినా కారుణ్య భావంతోనూ, ప్రభుత్వ పథకాలకు చేయూత నందించడం ద్వారా తమ ఆస్పత్రులు (ప్రాభవాన్ని పెంచుకోవాలని కొన్ని ఆస్పత్రులు ముందుకొస్తున్నాయి. కాగా ప్రభుత్వం కోరినప్పుడు మిగిలిన ఆసుపత్రులు కూడా ప్రజాసేవలో భాగంగా ప్రభుత్వానికి కలిసిరావాల్సిందే. స్టాఫ్ జీతాలు, మందులు, చికిత్సా పరికరాల ధరలు బాగా పెరిగినందున వాటిని భరించడం కష్టంగా ఉందని కార్పొరేట్ ఆస్పత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ (Arogyashri)ఆసుపత్రులు మొండికేసి సేవలు నిలిపివేస్తున్నప్పుడల్లా కొన్ని నిధులు ప్రభుత్వం నుండి వస్తుంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి అమలవుతోంది. కనీసం ఆపరేషన్ ఖర్చులు కూడా రావడం లేదని ఆస్పత్రి యాజమాన్యాలు ఆందోళనపడ్తున్నాయి. ప్రభుత్వ ఉచిత వైద్య సేవలు ఆపి ప్రైవేట్ ఆస్పత్రులుగా నడుపుకుంటే ప్రభుత్వపర వైద్య సేవల అందుబాటుకు మరింత కష్టతరమవుతోంది. అయినా కార్పొరేట్ ఆస్పత్రులన్నీ తెగించి ప్రస్తుతం వైద్య సేవలను నిలిపి వేశారు. తెలంగాణలో 477 ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ (Arogyashri)వైద్యం లభిస్తుంది. ఈ మధ్యనే తెలంగాణలో 62 ఆసుపత్రులు తాము తక్కువ ప్యాకేజీకీ కాదు. సకాలంలో బకాయిల్లేకుండా పూర్తిస్థాయిలో బిల్లులు సొమ్ము విడుదల చేయగలిగితేనే తాము వైద్యసేవల్ని కొనసాగిస్తామని అల్టిమేటం జారీ చేశాయి. దాంతో కొన్ని నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడంతో కాస్త ఉపశమనం కలిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని కార్పొరేట్ ఆస్పత్రులలో అనేక ప్రైవేట్, నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఔటేపేషంట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. కొన్ని ఆసుపత్రులు అత్యవసర కేసులను మాత్రమే చూస్తున్నాయి. ప్రభుత్వం నుంచి దాదాపు రూ.1500 కోట్లకుపైగా బకాయిలుంటాయని లెక్క చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వానికి పెట్టిన బిల్లుల మంజూరులో కూడా వ్యత్యాసాలున్నట్లు కొన్ని ఆస్పత్రులు ఆరోపిస్తుంటాయి. రాష్ట్రమేదైనా ఆర్థిక సంబంధిత అంశాల్లోనే ‘ఆరోగ్యశ్రీ’ చికిత్సలు ఆగిపోతున్నాయి. ప్రభుత్వం తక్షణం నిధులు బకాయిలు విడుదల చేయలేకపోతోంది. ప్రయివేటు ఆస్పత్రులు వైద్యసేవలకు ముందుకురాలేకపోతున్నాయి. ఈ సమస్యలు ఎప్పటికప్పుడు తాత్కాలిక పరిష్కారానికే పరిమితమవడంతో తరచు ఇలాంటి విరామం వస్తోంది. రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల మొత్తంపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సెంట్రలైజెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్లో రూ.674 కోట్ల మేరకు బకాయిలున్నట్లు చూపెడుతోంది. ఇవిగాక తాజాగా పేరుకున్న బకాయిలు 3వేల కోట్లకుపైగానే ఉన్నాయని తేల్చారు. ఒక నిర్దిష్టమైన పరిష్కారం లేకుంటే ఆరోగ్యశ్రీ (Arogyashri)ని నమ్ముకున్న రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఆయా ప్రభుత్వాలు తమకు ఉన్న ఆర్థిక లోటుతోనో, బడ్జెట్ లోటుతోనో ముడిపెట్టకుండా ఏటా బడ్జెట్లలో ఆరోగ్యశ్రీ, తదితర వైద్యసేవలకు ప్రత్యేక కేటాయింపు చేసి ఆదుకోవాల్సిన అవసరముంది. డాక్టర్ ఎన్టీఆర్వైద్యసేవా ట్రస్ట్ పథకం కింద పేద రోగులకు అందించే ఉచిత చికిత్స సేవలను గత 3 రోజులుగా ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ఆసుపత్రులన్నిటా ఓపిడి సేవలు నిలిపివేయడం వల్ల గ్రామీణ రోగులు బాగా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ పరిశీలనలో ఆసుపత్రులకు కేవలం రూ.2700 కోట్ల బకాయిలే ఉన్నాయి. పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వాల్సి ఉన్నందున ప్రభుత్వ ఆర్థిక భారాన్ని అత్యవసరంగా మోయగల పరిస్థితి లేదని ప్రభుత్వవర్గాల వివరణ. ప్రత్యామ్నాయం ఏర్పాట్లు లేకపోవడం అర్థాంతరంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం పేద రోగులకు అసౌకర్యం కలిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Arogyashri Breaking News Healthcare Scheme latest news medical services public health Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.