అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న నీటికుంటలో సరదాగా ఈతకు వెళ్లి ఓ ఆర్మీ జవాన్ మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసు కుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీపురం గ్రామానికి చెందిన బంగారు వెంకటేష్ కుమారుడు ఆంజనేయులు (23) నాలుగు సంవత్సరాల క్రితం అగ్నివీర్ పథకం మేరకు ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామానికి ఇటీవల వచ్చాడు. తన మిత్రులు సోము, హరీష్లతో కలసి సరదాగా రజాపురం, వైటి చెరువు గ్రామాల నడుమ ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్లారు. సోముకు మాత్రమే ఈత వస్తుంది. మిగిలిన ఇద్దరికీ ఈత రాదు.
Read also: Jagan : బీజేపీతో జగన్ అక్రమ పొత్తు – షర్మిల
Anantapur Crime: Army Jawan Dies After Falling into Water Pit While Swimming
సోము బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆంజనేయులు, హరీష్ నీటికుంట మొదలు ప్రాంతంలో సరదాగా ఈత కొట్టారు. ఈ నేపథ్యంలో ఆంజనేయులు పట్టు తప్పి లోపలికి వెళ్లిపోయాడు. స్నేహితుడు హరీష్ కేకలు విని సోము హడావుడిగా కుంటలో గాలింపు చర్యలు చేపట్టాడు. అయినా ఫలితం శూన్యమైంది. వారి కేకలు విన్న గ్రామస్తులు కుంటలో గాలించారు. అయినప్పటికీ ఫలితం శూన్యం. ఎట్టకేలకు గుంతకల్లు నుండి వచ్చిన అగ్నిమాపకదళ కేంద్రం సిబ్బంది గాలించగా జవాన్ మృతదేహం లభ్యమైంది. ఆయన మృతితో శ్రీపురం శోకంలో మునిగిపోయింది. ఈ సంఘటనపై అర్బన్ సిఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: