हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

children: నేటి బాలలే రేపటి బానిసలా!

Sudha
children: నేటి బాలలే రేపటి బానిసలా!

భారతదేశ భవిష్యత్తు నేటిబాలలపై ఆధారపడి ఉన్న దని, నేటి బాలలే రేపటిపౌరులు అంటూ నినదించి స్వాతంత్య్రనాంతరం భారతదేశపునర్నిర్మానానికి స్వాతంత్య్ర సమరయోధులు నాందిపలికారు. అదే క్రమంలో 1947 తరువాత దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు, సమానగౌరవం, సమానవిలువ ఉండేవిధంగా భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగాన్ని రచించుకుని దేశనిర్మాణానికి అంకురార్పణచేశారు. కొద్దిమేర అభివృద్ధి సాధించగలి గాము. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులను పరిశీలిస్తే దేశనిర్మాణం కాస్త విభజన విధ్వంసం కూల్చివేతలవైపుకు మనుషుల మధ్య ద్వేషం పెరుగుతున్నట్లు ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడజిల్లా పిఠాపురం మండలం జడ్పీ పాఠశాలలో 01డిసెంబర్ 2025న ముగ్గురు ఉపాధ్యాయులు అదే పాఠశాలలో చదువుతున్న బాలలను వారి కులాలపేరుతో నీచంగా అవమానకరంగా వేధించటం, ఎస్సీలు, ఎస్టీలు ఏమీ చేయలేరు. అంటూ నిరంతరం అవ హేళన చేస్తూ విద్యపై ఆసక్తి తగ్గేవిధంగా నిరుత్సాహపరు స్తూ ఆడపిల్లలను చెడ్డపేరుతో వంకరగా పిలుస్తున్నారని ఆ పసిహదయాలు తల్లడిల్లిపోయి మీడియా ముందుకు వచ్చి చెప్పేవరకు ఆ విషయాలు బయటకురాలేదు అంటే అమా యక పసిపిల్లలను కీచక ఉపాధ్యాయులు ఎప్పటి నుండో మానసికంగా, శారీరకంగా ఏడిపిస్తున్నారని అర్థమవుతుంది. దీనిపై జిల్లా కలెక్టర్ మండల విద్యాధికారిచే విచారించి నిజ నిర్ధారణ అయిన తర్వాత కులవివక్ష చూపిన ఉపాధ్యాయు లను సాధారణ బదిలీ చేసి వదిలివేశారు. మరల ఆ పసి హృదయాలు అడుగుతున్నాయి. ఈ విలువలులేని కీచక) ఉపాధ్యాయులు ఎక్కడకువెళ్లారో అక్కడ కూడా ఎస్సి విద్యా ర్థులను అవహేళన చేస్తూ అవమానిస్తూ కులవివక్షను చూపు తారుకదా అప్పుడు బదిలీ అనేది ఏరకంగా శిక్షఅవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. కుల వివక్షకు అంతంలేదు అన్నట్లుగా ఆప్రశ్నలకు కూడా సమాధానం లేదు. అదే నియోజకవర్గంలో ఏప్రిల్ 2025న మళ్లాం గ్రామంలో కులం పేరుతో కొన్ని కుటుంబాలను గ్రామ బహిష్కరించినప్పుడు నిందితులను శిక్షించినట్లయితే ఇది జరిగి ఉండకపోయేది అంటే తప్పు చేసిన వాడిని చట్టప్రకారం శిక్షించకపోతే నిందితులను మరల తప్పుచేయమని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తు న్నాయని అర్థం చేసుకోవాల్సివస్తుంది. ఈవిషయాలు ప్రజలు అర్థం చేసుకున్న రోజు ప్రజలే తిరుగుబాటు చేసిశిక్షిస్తారు.

Read Also : AP: మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

children
children

కులం పేరుతో..

ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో పొందూరులోని ఒకవిద్యాల యంలో మహిళాప్రిన్సిపల్ ఒక షెడ్యూల్డ్ తెగకు చెందిన విద్యార్థినిని, వాళ్ళ అమ్మను కులంపేరుతో పదేపదే తిట్టుతూ అవమానపరుస్తూ, కించపరుస్తూ, ఉంటే ఫిర్యాదు చేయటా నికి వీలులేదు అని సమగ్రశిక్ష ఏపీసి సైతం బెదరించటం దేనికి సంకేతం. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోని మెలి యుపుట్టి మండలం బండపల్లి బాలికలట్రైబల్ ఆశ్రమం పాఠశాలలోని ఉపాధ్యాయునిగా ఉన్న ఉపాధ్యాయునిరాలు కుర్చీలో కాళ్లుచాపుకొని మొబైల్ మాట్లాడుతూ ఇద్దరు విద్యా ర్థులచే బలవంతంగా కాళ్లకు మసాజ్ చేయించు కుంటుంది. ఆ ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థినీలను ఎలాచూస్తుంది అని ఆలోచిస్తే తన ఇంట్లోపని చేసే పనివారివలె లేదా బానిసల వలె వీరిని ఆమె భావించి వీరిచేత ఆవిధంగాచేస్తుంది. తర్వాత ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీతంపేటవారు విచారణ జరిపి సస్పెండ్ చేశారు. ఇదే విధంగా మనరాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికలచే ప్రిన్సిపల్ క్వాటర్స్ లో ఉండే ఉపాధ్యా యులకు నీళ్ల బకెట్లను బలవంతంగా మోయించటం ఈమధ్యకాలంలో పేపర్లో చూసాం. అమలాపురం దగ్గర ఐ. పోల వరం మండలంలోని ఆరో తరగతి చదివే బాలికకు చాక్లెట్లు ఇస్తూ మాయమాటలు చెప్పి ఉపాధ్యాయుడు అత్యాచారా నికి పాల్పడ్డఉదాంతం, అదే విధంగా కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాలలోని విద్యార్థిని తాతను అంటూ తీసుకువెళ్లి బాలికపై అత్యాచారం చేయటం, తిరుపతి సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఉపాధ్యా యుడు విద్యార్థినిపై అత్యాచారం చేయటం, సత్యసాయి జిల్లాలో 15 సంవత్సరాల ఎస్సీ బాలికను రెండు సంవత్స రాలుగా 17 మంది అత్యాచారం చేసిన సంఘటన, మొబైల్ దొంగతనం చేసిందని ఆరోపణలు 17 సంవత్సరాల ఆదివాసీ బాలికను బట్టలిప్పి దారుణంగా దాడిచేసి వేడికర్రతో కాల్చిన సంఘటనలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనేజరిగాయి.

మనుషులందరూ సమానమే

ఉత్తర ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్ పాఠశాలల్లోని బాలబాలికలపై జరిగిన దాడులు ఎన్నో చూస్తూనే ఉన్నాం. హర్యానాలో మంచినీళ్ల కుండలో నీళ్లుతాగాడని ఒకఎస్సీ బాలుడును ఉపా ధ్యాయుడు కొట్టిచంపాడు. మధ్యప్రదేశ్లో బాగా చదివే ఒక ఆది వాసీ బాలిక మొదటి బెంచీలో కూర్చున్నదని కొట్టటం, పిల్లలకు ఫలహారాన్ని నేలపై న్యూస్పేపర్లో పెట్టడం. ఈ విధంగా భారతదేశవ్యాప్తంగా బాలబాలికలను కులంపేరుతో చిత్రహింసలకు గురిచేయటం అమాన వీయం. ఇది దేశానికే ప్రమాదం. దేశంలోకానీ, రాష్ట్రంలోకానీ ఒక ఉపాధ్యాయుడు అవ్వాలంటే ఇంటర్లే దా డిగ్రీపూర్తి చేసి విద్యాబోధనలో డిప్లమోలేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తిచేసి టీచర్ అర్హత పరీక్ష క్వాలిఫై అయిన తర్వాత డీఎస్సీ రాసిన వారిలో ముందువరుసలో ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఉపాధ్యాయుడు సమాజానికి మూలస్తంభం వంటి వారు. చాలా హేతుబద్ధతతో, శాస్త్రీయంగా కులాలకు, మతాలకు, ప్రాంతా లకు, లింగ, భాషభేదాలను అధిగమించి మను షులందరూ సమానమే అనే మానవత్వాన్ని బోధిస్తూ మాన వత్వంగల సమ సమాజాన్ని నిర్మిస్తారు. కానీపైన పేర్కొన్న సంఘటన లో ఉన్నదోషులందరూ ఉపాధ్యాయులేననిగ్రహిస్తే సమాజం ఎటుపోతుందనని మనం అర్థంచేసుకోవాలి. సామాజిక సమ స్యలపై స్పందించే ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళాసంఘాలు, ప్రజాసంఘాలు సభ్యసమాజం బాధితుల కులాలను బట్టి స్పందించటం కూడా ఇటువంటి నీచులను వెనకేసుకుని రావటమే అవుతుంది. అభంశుభం తెలియని అమాయక పసిపిల్లలపట్ల క్రూరమృగాలచలెప్రవ ర్తిస్తున్న వీరివలన భారతదేశానికి ఏమీ లాభంలేదు సరికదా, స్వాతంత్య్ర పూర్వపు రోజులను గుర్తుచేస్తున్నాయి. ఇది మని షిమనసులో ఉన్నవిషతుల్యమైన ఆలోచనలు మనిషిని మని షిగా చూడలేని మనస్తత్వం ఉన్న అశాస్త్రీయమైన మూఢ నమ్మకాల సిద్ధాంతాలను నమ్మడం వల్ల మానసికరోగులుగా ప్రవర్తిస్తారు. వీటిని ప్రభుత్వాలు వెంటనే నిషేధించాలి. మనుషులందరూ సమానమే అనే సోదరభావాన్ని ప్రచారం చేయాలి.

children
children

నాణ్యమైన విద్య అందక

సాటి మనిషిని మనిషిగా చూడలేని వాడు మానసిక రోగి అవుతాడు, వాడు మనిషిగా అప్పుడే చనిపోయినట్లు వాడు ఉండవలసినది పిచ్చి ఆసుపత్రిలో అంతేకానీ పాఠశాలల్లో ఉండే అర్హతలేదు. ప్రభుత్వపాఠశాలలో ఎవరైతే ఉపా ధ్యాయ వృత్తిలో ఉన్నారో వారిపిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి. లేకపోతే ప్రభుత్వపాఠశాలల్లో చదివే నిరుపేద తక్కువ కులాల పిల్లలు(children) బాగా చదువుకుని ప్రైవేటు పాఠశాలలో చదివే ఉపాధ్యాయుల పిల్లలకు పోటీ వస్తారేమో నన్నా సంకుచిత భావంతో ఈపిల్లల (children)పట్ల నీచంగా నూ, హేయంగాను వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుంది. అదే విధంగా ఈనిరుపేద కులాల పిల్లలు తరతరాలుగా వాళ్ల తల్లిదండ్రులవలె భూస్వాములకు, పెత్తందారులకు బానిస లుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితమైన పథకం ప్రకారం చేస్తున్నారేమో అనేవిధంగా భావించాల్సి వస్తుంది. బాలబాలికలపట్ల కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలతో వివక్షచూపుతూ మానసికంగా శారీరకంగా హింసి స్తున్నారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించి చట్టప్రకారం శిక్షించి వారి ఆస్తులను ప్రభుత్వం వారు జప్తుచేసుకుని రాష్ట్రంలో కులనిర్మూలన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో కులనిర్మూలన వైపుకు సమానత్వంవైపుకు బాటలు వేయాలి. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో డ్రాట్అవుట్ పెరిగి ప్రభుత్వ పాఠశాలలు మూతపడటానికి, నిరక్షరాస్యత పెరగటానికి, విష తుల్యమైన మనసు కలిగిన కొద్దిమంది ఉపాధ్యాయులు పాఠశాలలో బోధనసరిగాచేయకపోవడంవల్ల, నాణ్యమైన విద్య అందక దేశానికి నైపుణ్యంగల మానవవనరులు అంద టంలేదు. దీనంతటికీ ప్రధాన కారణం మానవత విలువలు, రాజ్యాంగ విలువలను అర్థంచేసుకోలేని కొందరు దుర్మార్గపు ఆలోచన పరులైన ఉపాధ్యాయుల వలననే గ్రహించి తులసివనంలో గంజాయి మొక్కలైనా ఈ కీచిక ఉపాధ్యా యులను పీకి పారేస్తే పాఠశాల విద్యావ్యవస్థకు తద్వారా యావత్భారత దేశానికి మంచి రోజులువస్తాయి.
-డా. బోరుగడ్డ సుబ్బయ్య

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870