ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ఏపీ ఆర్టీసీ ఉద్యోగ (APSRTC) సంఘాల పట్ల ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ), ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సంఘాలను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చడం ద్వారా ఉద్యోగుల సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశాన్ని కల్పించింది. ఈ నిర్ణయం అనంతరం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Read also: విమానాశ్రయాలపై సైబర్ అటాక్ అప్రమత్తమైన కేంద్రం

ఆర్టీసీ ఆస్తుల లీజ్ ప్రతిపాదనపై సీపీఐ ఆందోళన
ఈ సభ్యత్వం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు(APSRTC) ప్రభుత్వ చర్చల్లో నేరుగా పాల్గొని వారి సమస్యలు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్ల వంటి అంశాలను దృష్టికి తీసుకొచ్చే అవకాశం కలుగుతుంది. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల సంక్షేమానికి దోహదం చేస్తుందని సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే, సీపీఐ పార్టీ ఆర్టీసీ ఆస్తులపై తయ్యారైన ప్రతిపాదనను విరమించమని సూచించింది. భవనాలు, డిపోలు, స్థిరాస్తులు లీజ్ లేదా తనఖా పెట్టడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ముఖ్యమంత్రి వద్ద ఈ లేఖను సమర్పించి తక్షణమే ప్రతిపాదనను నిలిపివేయమని కోరారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: