Nandyal Crime: ఏపీ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక కండక్టర్, ప్రయాణికుల దాడి!

Read Time:  1 min
apsrtc-pileru-driver-attacked-by-karnataka-conductor-passengers-srisailam
apsrtc-pileru-driver-attacked-by-karnataka-conductor-passengers-srisailam
FONT SIZE
GET APP

Nandyal Crime: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శిఖర చెక్‌పోస్టు వద్ద ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై కర్ణాటక బస్సు కండక్టర్, ప్రయాణికులు జరిపిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రోడ్డుపై వాహనాల క్రమశిక్షణ విషయంలో మొదలైన చిన్న మాట పట్టింపు, ఒక ప్రభుత్వ ఉద్యోగిపై భౌతిక దాడికి దారితీసింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సమన్వయం లోపించి, నడిరోడ్డుపై డ్రైవర్‌ను అవమానించిన తీరు విచారకరం.నంద్యాల జిల్లాలోని శ్రీశైలం శిఖర చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

Read Also: Polavaram MLA Chirri Balaraju Cyber Scam: జనసేన ఎమ్మెల్యేకు సైబర్ కేటుగాళ్ల టోకరా

apsrtc-pileru-driver-attacked-by-karnataka-conductor-passengers-srisailam
apsrtc-pileru-driver-attacked-by-karnataka-conductor-passengers-srisailam

Nandyal Crime: అసలేం జరిగింది?

పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కర్ణాటక బస్సు లు రెండు శ్రీశైలం శిఖరం చెక్‌పోస్టు రహదారిలో ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక బస్సు డ్రైవర్ క్యూ ప్రకారం కాకుండా.. బస్సును ఇష్టానుసారం నడపటంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఆంటకం కలిగింది. దీంతో పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ చాంద్ భాషా.. బస్సును సరిగ్గా నడపాలని, అడ్డదిడ్డంగా ఎందుకు నడుపుతున్నారని కర్ణాటక బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి , తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

వీరి మధ్యలో జోక్యం చేసుకున్న కర్ణాటక బస్సు కండక్టర్ , బస్సులోని కొందరు ప్రయాణికులు..ఏపీ ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేశారు.పీలేరు ఆర్టీసీ బస్ డ్రైవర్ చాంద్ భాషాను బలవంతంగా బస్సులోకి ఎక్కించి అతనిపై దాడి చేశారు. అనంతరం డోర్నాల వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో నిర్హాంతపోయిన డ్రైవర్ చాంద్ భాషా.. వెంటనే డోర్నాల పోలీస్ స్టేషన్ చేరుకుని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాంద్ భాషా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్ణాటక బస్సు కండక్టర్, ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.