📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

APSRTC Buses Vijayawada: సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు

Author Icon By Rajitha
Updated: January 7, 2026 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8 వేల 432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎపీఎస్ ఆర్టీసీ (APSRTC) ప్రకటించింది. ఈసారి స్త్రీశక్తి పథకం దృష్ట్యా రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక బస్సుల ఏర్పాటులో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. 71 శాతం బస్సులను రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక సర్వీసులుగా నడపాలని నిర్ణయించింది. గ్రామాలు, మండలాలు, పట్టణాల మధ్య రద్దీ గణనీయంగా పెరిగిన దృష్ట్యా వీటి మధ్య 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

Read also: Roja : చిల్లర మాటలు మానుకో.. రోజాకు నుడా చైర్మన్ కోటంరెడ్డి కౌంటర్

RTC special buses for Sankranthi

కడప జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు

ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు 2 వేల 432 ప్రత్యేక బస్సులుగా నడిపేందుకు కేటాయించింది. పండగ ముందు రోజుల్లో మొత్తం 3857 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. వీటిలో హైదరాబాద్ కు 240, 102, 3 15 బస్సులు ఏర్పాటు చేయగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 3500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పండుగ తిరుగు ప్రయాణానికి మొత్తం 4 వేల 575 బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కు 1800, బెంగళూరు 200, చెన్నై 75 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా వీటిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య నడిపేందుకు 2500 బస్సులు ఏర్పాటు చేశారు.

ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ బస్సుల్లోని చార్జీనే. వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దూర ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ తెలిపింది. కడప నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసారు. సంక్రాంతికి కడవ జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి 40, బెంగుళూరు నుంచి 40 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి 30, చెన్నై నుంచి 10 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు నడవనున్న బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh APSRTC latest news Sankranti Special buses Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.