📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’

APSRTC: ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు: చంద్రబాబు నాయుడు

Author Icon By Rajitha
Updated: December 24, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వచ్చే యేడాది కొత్తగా 1450 ఎలక్ట్రిక్ బస్సులు పుష్కరాల కోసం గోదావరి జిల్లాల్లో ముందుగా ఛార్జింగ్ స్టేషన్లు

సచివాలయం : ఏపిఎస్ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు (Electric bus) ‘పల్లెవెలుగు’కు చెందనివైనా తప్పని సరిగా ఏసివే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టే 1450 బస్సులు కూడా ఈవినే కొనుగోలుచేయాలని స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని గోదావరి జిల్లాల్లో ఈవి చార్జింగ్ స్టేషన్లు ముందుగా ఏర్పాటు చేయాలని వీటికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని సూచించారు. ఏపిఎస్ ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఈ బస్సుల రోడ్డు మ్యాప్ పై సచివాలయంలో మంగళవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

Read also: Pawan Kalyan : పవన్ నీ పీకుడు భాష కట్టిపెట్టాలి అంటూ బొత్స కీలక వ్యాఖ్యలు

APSRTC

8 ఏళ్ళ కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న

వచ్చే ఐదేళ్ళలో 8819డిజీల్ బస్సుల స్థానంలో ఈవి బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్ళ కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న బస్సులను ఈవీలుగా మార్పిడి చేయాలని నిర్దేశించారు. ప్రయాణీలకు అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. స్త్రీశక్తి -మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పధకంతో తలెత్తిన రద్దీకీ తగినట్లుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. పర్యావరణ రహితంగా ప్రజా రవాణా: రాష్ట్రంలో పర్యావరణహితమైన ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈవి బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. 2030నాటికి దశలవారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను మాత్రమే నిర్వహించాలన్నారు.

తిరుమల-తిరుపతికి మరో 300 ఈ-బస్సులు

దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా సంస్థపై ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. ఈ బస్సుల మెయింటేనెన్స్ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించాలన్నారు. స్వయం సమృద్ధి సాధించేలా రైల్వే శాఖ తరహాలో ఏపిఎస్ఆర్టీసీ కార్గో రవాణాపై మరింత దృష్టి పెట్టాలన్నారు. పీఎం- ఈ బస్ సేవా పధకం కింద 750ఈ-బస్సులు రాష్ట్రానికి అందిస్తుందని అలాగే తిరుమల-తిరుపతికి మరో 300 ఈ-బస్సులు ఇచ్చేందుకు కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. థింక్ గ్యాస్ సంస్థ భాగస్వామ్యంతో చిత్తూరు- వెల్లూరు మార్గంలో నడిపే డీజిల్ బస్సులను సిఎన్జీగా మార్చే పైలట్ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైందని అధికారులు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

APSRTC electric buses latest news Palle Velugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.