ట్రాన్స్ ఫార్మర్ కొనుగోళ్లలో రూ.40.000 కోట్ల అవకతవకలు తిరుపతి రూరల్ : ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపిఎస్పీడిసిఎల్), (APSPDCL) అనుబంధ విద్యుత్ డిస్కాంలలో ట్రాన్స్ ఫార్మర్స్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయని సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఏబి వెంకటేశ్వరరావు, చక్రవర్తిలు ఆరోపించారు. డాక్యుమెంటరీ ఆధారాలు, ఆర్టీఐ రికార్డులు, తనిఖీ నివేదికలు, కొనుగోళ్ల ఆర్డర్స్ ఆధారంగా షిర్డీ సాయి ఎక్ట్రికల్స్ ప్రవేట్ లిమిటెడ్ అనే ప్రవేట్ కంపెనీకి ప్రయోజనం చేకూర్చటానికి రూ.40,000కోట్ల విలువైన టెండర్లు, కొనుగోళ్లు అమోదాలను తారుమారు జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం ఏపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి కలిసి వినతిపత్రం అందజేసారు. అనంతరం ఏబి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కర్మను తప్పించుకోగలమేమో గానీ కరెంట్ బిల్లును మాత్రం తప్పించుకోలేం” మన పిల్లలైన ఆ బిల్లులు కట్టాల్సిందేనని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరో చేసిన అవినీతికి సామాన్య వినియోగదారుడు ఎందు భారం మోయాలని ప్రశ్నించారు.
Read also: Tirupati : పుట్టగొడుగుల పరిశోధన కేంద్రంగా శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల
APSPDCL: విద్యుత్ టెండర్లలో మాయాజాలం
రూపాయి విలువ చేసే వస్తువును మూడు రుపాయాలకు కొనుగోలు చేసి, భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వంలో ఎపిఎస్పీడిసిఎల్ (APSPDCL) చైర్మెన్ గా నియమితులైన సంతోషరావు హయాంలోనే భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆరోపణలకు సంబంధించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు కోరినా అధికారులు ఇవ్వలేదన్నారు. 12సార్లు అప్పీలు చేసినా సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని, 2023 నుండి ఎస్పీడిసిఎల్లో అవినీతి వ్యవస్థీకృతంగా మరిందన్నారు. అధికారులు, కంపెనీలు కుమ్మకై అవినీతి సొమ్మును పంచుకున్నారని ఆరోపించారు. టెండర్స్లో బహుళ సంస్థలు పాల్గొనే విధంగా పోటీ పెంచాల్సి ఉండగా ఒకే సంస్థకు కాంట్రాక్టులు అన్నీ కట్టబెట్టారని ప్రశ్నించారు. టెండర్ నిబంధనలు మారుస్తూ… సాంకేతిక ప్రమాణాలను సడలిస్తూ ఇతర కంపెనీలను అర్హత రహితంగా మార్చినట్లు పత్రాలు తెలియజేస్తున్నాయని తెలిపారు.
విద్యుత్ (current) కొనుగోలు చట్టం ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ ప్రకారం ఉండాల్సిన అనుమతులు లేకుండా ఉన్నతాదికారులే అప్రూవల్ ఇచ్చినట్లు రికార్డ్స్ ఎందుకు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రిపోర్టుల్లో పెయిలైన ట్రాన్స్ ఫార్మర్కు కూడా బిల్లులు ఆమోదించినట్లు బయటపడినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక రేట్లకు ట్రాన్స్ ఫార్మర్ కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25కెవి 2- స్టార్ ట్రాన్స్ ఫార్మర్స్ ్కు రూ.1,19,899 చెల్లించగా అదే సామర్థ్యం కలిగిన ట్రాన్స్ ఫార్మర్లకు తెలంగాణా ప్రభుత్వం రూ.87,791, చత్తీస్ గర్ . 75,496, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.73,101 రుపాయాలకే కొనుగోలు చేసినట్లు రికార్డులు తెలుపుతున్నాయని తెలిపారు. 5 స్టార్ మోడల్ ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలుకు ఏపి ప్రభుత్వం రూ.1,36,46,499 చెల్లించారని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే భారీగా చెల్లించిన ఈ ధరల వ్యత్యాసం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానకు కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. టెండర్ మాయా జాలానికి సంబంధించిన విచారణను ఏసిబిచే చేయించాలని డిమాండ్ చేసారు.
ఏ విభాగంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి?
ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఎస్పీడీసీఎల్) మరియు ఇతర విద్యుత్ డిస్కాంలలో ట్రాన్స్‌ఫార్మర్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ అవినీతి మొత్తం ఎంత విలువైనదని చెబుతున్నారు?
సుమారు రూ.40,000 కోట్ల విలువైన టెండర్లు, కొనుగోళ్లు అనుమానాస్పదంగా జరిగినట్లు సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: