APSPDCL: విద్యుత్ పంపిణి సంస్థల్లో అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి

Read Time:  1 min
APSPDCL: విద్యుత్ పంపిణి సంస్థల్లో అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి
FONT SIZE
GET APP

APSPDCL: విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎపిఎసిపిడిసిఎల్, ఎపిసిపిడిసిఎల్లలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. “విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎపిఎసిపిడిసిఎల్, ఎపిసిపిడిసిఎల్లలో పలురకాల అక్రమాలు, అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : AP IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

APSPDCL: A thorough investigation should be conducted into irregularities and corruption in power distribution companies
APSPDCL: A thorough investigation should be conducted into irregularities and corruption in power distribution companies

అధిక ధరలు

గత వైసిపి ప్రభుత్వ హయాంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ వైర్లు, విసిబిలు వంటి తదితర పరికరాలను మార్కెట్ ధరలకన్నా అధిక ధరలు వెచ్చించి, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోకన్నా రెట్టింపు రేట్లతో పలు కంపెనీల నుండి కొనుగోలు చేశారు. ఎపికి విద్యుత్ పరికరాలు సప్లయ్ చేస్తున్న కంపెనీలే ఇతర రాష్ట్రాలకు 50శాతం తక్కువ ధరకు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో దాదాపు రూ.3 వేల కోట్లను ఆయా కాంట్రాక్టర్లకు, సప్లయర్లకు చెల్లించగా, మార్చి నెలాఖరు నాటికి మరో రూ.1000 కోట్లను ఇచ్చేందుకు పావులు కదుపుతోంది.

తెలుగుదేశం పార్టీ గగ్గోలు

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది. కాని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యుత్ పంపిణీ సంస్థలలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఎటువంటి విచారణలు చేపట్టకపోగా, గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లకు అనుగుణంగా అవే కంపెనీలకు మళ్లీ కాంట్రాక్టులను అప్పగిస్తూ, వేల కోట్ల రూపాయలను అప్పనంగా చెల్లించడం విచారకరం. ఆయా అక్రమాల వెనుక విద్యుత్ పంపిణీ సంస్థలోని పెద్ద గద్దల అవినీతి వెలుగు చూస్తోంది. గత ప్రభుత్వ కాలంలో అక్రమాలు జరిగాయంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి ఆయా అక్రమాలన్నీ సక్రమాలైపోయాయా? అందుకోసం ఎంత మొత్తం చేతులు మారింది?” అని గుజ్జుల ఈశ్వరయ్య నిలదీశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.