📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Nara lokesh news : లోకేశ్ చొరవతో ఏపీఎస్పీకి శుభవార్త, 300 మందికి ప్రమోషన్

Author Icon By Sai Kiran
Updated: March 13, 2026 • 11:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nara lokesh news : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పదోన్నతుల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు చివరకు శుభవార్త లభించింది. ప్రభుత్వం ఏకకాలంలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఏఆర్ఎస్ఐ) పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రక్రియ వేగంగా పూర్తయ్యింది. చాలా కాలంగా పదోన్నతులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు ఇటీవల ప్రజాదర్బార్‌లో మంత్రి లోకేశ్‌ను కలిసి తమ సమస్యను వివరించారు.

సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కారం చూపుతానని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రమోషన్ల ఫైల్‌ను ముందుకు తీసుకెళ్లారు.

Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి

Nara lokesh news

వాస్తవానికి 2014-19 మధ్య కాలంలోనే సివిల్, ఏఆర్ విభాగాలతో పాటు ఏపీఎస్పీ సిబ్బందికి కూడా పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు, తర్వాత ఎన్నికల నియమావళి అమలులోకి రావడం వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది.

గత ఐదేళ్లలో పలుమార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి లోకేశ్ జోక్యంతో ఈ ప్రక్రియ పూర్తి అయింది.

దీంతో సుమారు 300 కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ సమస్యను త్వరగా పరిష్కరించిన మంత్రి లోకేశ్‌కు ఏపీఎస్పీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.