📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

APRS CAT 2026: ఏపీ గురుకుల ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

Author Icon By Anusha
Updated: March 2, 2026 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

APRS CAT 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) తాజాగా ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2026 (APRS CAT 2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న గురుకులాల్లో బాలురు, బాలికలకు ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.

Read Also: Chittoor: “మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు

మిగిలిన తరగతుల్లో ఖాళీల భర్తీ.. ఎవరెవరు అర్హులు?

ఈ నోటిఫికేషన్ కేవలం ఐదో తరగతికి మాత్రమే పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గురుకుల పాఠశాలల్లో 6వ, 7వ,8వ తరగతుల్లో మిగిలిపోయిన (Backlog) సీట్లను కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు అనాథలు మరియు వికలాంగ విద్యార్థులకు నిబంధనల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

APRS CAT 2026: AP Gurukul Admissions Notification Released

5వ తరగతిలో అన్ని గురుకులాల్లో మొత్తం 4,080 సీట్లు ఉన్నాయి. 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు 1844 వరకు ఉన్నాయి. ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2026కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ప్రవేశం కోరుతున్న తరగతికి ముందు తరగతులు అంటే ఐదో తరగతి ప్రవేశాలకు 4వ తరగతిలో, 6వ తరగతి ప్రవేశాలకు 5వ తరగతిలో, 7వ తరగతి ప్రవేశాలకు 6 తరగతిలో, 8వ తరగతిలో ప్రవేశాలకు 7వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

విద్యార్ధుల వయసు ఐదో తరగతికి సెప్టెంబర్‌ 1, 015 నుంచి ఆగస్ట్ 31, 2017 మధ్య, ఆరో తరగతికి సెప్టెంబర్‌ 1, 2014 నుంచి ఆగస్ట్ 31, 2016 మధ్య, ఏడో తరగతికి సెప్టెంబర్‌ 1, 2013 నుంచి ఆగస్ట్ 31, 2015 మధ్య, ఎనిమిదో తరగతికి సెప్టెంబర్ 1, 2012 నుంచి ఆగస్ట్ 31, 2014 మధ్య జన్మించి ఉండాలి. ఈ ఆర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 చొప్పున చెల్లించాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24, 2026వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

5th Class Gurukula Entrance Exam AP AP Residential School Admissions 2026 APRS CAT 2026 Notification

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.