📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

News Telugu: APPSC: హాయ్ ల్యాండ్ లో మూల్యాంకనం నిజమే!

Author Icon By Rajitha
Updated: December 17, 2025 • 2:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : గ్రూప్-1 హైకోర్టుకు నివేదించిన జస్టిస్ శంకర్ కమిటీ కేసు విచారణ 29కి వాయిదా ఏపీపీఎస్సీ (APPSC) లోని నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను మంగళగిరి, సమీపం హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో మూల్యాంకనం చేసినట్లు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వం లోని స్వతంత్ర కమిటీ తేల్చింది. ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేశారని పేర్కొంది. ఈ మేరకు నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక ప్రతులను ఇరుపక్షాల న్యాయవాదులు రిజిస్ట్రీ నుంచి పొందేందుకు వెసులుబాటు ఇచ్చింది. మరో వైపు మూల్యాంకనంలో గతంలో వాదనలు ముగింపు తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం, విచారణను ప్రారంభించాలంటూ ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థులు వేసిన అనుబంధ పిటీషన్ ను అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు వద్ద ఉన్న రికార్డుల ధృవపత్రాలు పొందేందుకు న్యాయవాదులకు వీలు కల్పించింది.

Read also: AP: స్టడీ సర్కిళ్ల ద్వారా పేద విద్యార్థులకు సివిల్స్ ఉచిత శిక్షణ

The evaluation at Hi-Land is indeed true

తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం… తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 2018 నాటి నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న కారణంగా పరీక్షను రద్దు చేసి, తాజాగా నిర్వహించాలని హైకోర్టు సింగిల్ జడ్జి 2024 మార్చి 13న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ ఉద్యోగాలు పొందిన వారు, పొందని వారు ధర్మాసనం ముందు వేర్వేరుగా అప్పీళ్ళు వేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం… నివేదిక ఇచ్చేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ చైర్మన్ గా, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటా రామారావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వీసీ, ఫ్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ సభ్యులుగా స్వతంత్ర కమిటీని నియమించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

appsc Group 1 Exam Justice Shankar Committee latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.