గ్రూప్‌-2 మెయిన్స్‌ యథాతథం : ఏపీపీఎస్సీ

Read Time:  1 min
appsc in group 2 mains exams
appsc in group 2 mains exams
FONT SIZE
GET APP

అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తప్పవంటూ వార్నింగ్

అమరావతి : గ్రూప్-2మెయిన్స్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అని తెలిపారు. సోషల్ మీడియాలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దు అని సూచించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టనున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

గ్రూప్‌-2 మెయిన్స్‌ యథాతథం  ఏపీపీఎస్సీ

రెండు సెషన్లలో పరీక్షలు

గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రద్దు అంటూ వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దు అని రెండు సెషన్లలో పరీక్ష జరుగుతుందని ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈనెల 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగనుందని తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మద్యాహ్నాం 3.గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది అని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది.

గ్రూప్-2మెయిన్స్‌పై అభ్యర్థుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్షల్లో రోస్టర్‌ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షలకు రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

// ── Embeds ── if (document.querySelector('blockquote.twitter-tweet, .twitter-tweet')) { const s = document.createElement('script'); s.src = 'https://platform.twitter.com/widgets.js'; s.async = true; s.charset = 'utf-8'; document.body.appendChild(s); } if (document.querySelector('.instagram-media')) { const s = document.createElement('script'); s.src = 'https://www.instagram.com/embed.js'; s.async = true; document.body.appendChild(s); }