2018 ఏడాదికి సంబంధించిన (APPSC) గ్రూప్-1 నియామకాల వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సుప్రీమ్ కోర్ట్, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తుది నిర్ణయం వెలువరించింది.
Read Also:Tirupati Airport Record: 10 లక్షల మార్కును దాటేసిన తిరుపతి ఎయిర్‌పోర్ట్!
గతంలో హైకోర్టు, అభ్యర్థులకు అప్రాధాన్యత (non-preferential) కేటగిరీకి చెందిన పోస్టులను కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్స్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి, హైకోర్టు నిర్ణయంలో జోక్యం అవసరం లేదని పేర్కొంది. దీంతో హైకోర్టు ఆదేశాలు యథాతథంగా అమల్లో కొనసాగనున్నాయి. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి తొలగినట్లు భావిస్తున్నారు. సంబంధిత అభ్యర్థులకు పోస్టుల కేటాయింపులో స్పష్టత లభించడంతో త్వరలోనే తదుపరి పరిపాలనా చర్యలు చేపట్టే అవకాశముంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: