విజయవాడ : రాష్ట్రంలోని(AP) విశ్వవిద్యాలయాలన్నింటికీ కలిపి ఒకటే చట్టాన్ని ఉన్నత విద్యాశాఖ తీసుకురాబోతోంది. ఏకీకృత చట్టం రూపకల్పనకు ఏర్పాటు చేసిన కమిటీ నూతన మార్పులను కొలిక్కి తీసుకువచ్చింది. త్వరలో మరోసారి సమావేశం నిర్వహించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి భారీగా సవరణలు తీసుకురానున్నారు. ఆర్జీయూకేటీ, పద్మావతి మహిళ, జేఎన్టీయూలు,(JNTU) క్లస్టర్, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు వేర్వేరు చట్టాలున్నాయి. మిగతా సాధారణ విశ్వవిద్యాలయాలకు ఒక చట్టం అమల్లో ఉంది. వీటన్నింటికీ కలిసి ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంగా తీసుకురానున్నారు. ఒకే చట్టంలో ఆయా వర్సిటీల ప్రాధాన్యాన్ని గుర్తించేలా అధికారాలు, పరిపాలన నిబంధనలు ఉంటాయి. రాజీవ్ గాంధీ సాంకేతిక విజ్ఞాన, విశ్వవిద్యాలయానికి ప్రత్యేక చట్టం ఉంది.
Read also: ఢిల్లీ పేలుడుతో ఐసిస్ ఉగ్రవాదులకు లింక్!
వర్సిటీల ప్రాధాన్యానికి అనుగుణంగా నూతన నిబంధనలు
అన్ని వర్సిటీలకు(AP) కులపతిగా గవర్నర్ ఉండగా, దీనికి కులపతిగా సీఎం ఉండేలా వైకాపా ప్రభుత్వంలో చట్టానికి సవరణ చేశారు. ఈ సవరణ చట్టం అమల్లోకి రాకుండానే గత ఎన్నికల్లో వైకాపా ఓడిపోయింది. దీంతో ప్రభుత్వం ఇన్ఛార్జి కులపతిగా ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తిని నియమించింది. గత ప్రభుత్వంలో చట్టానికి సవరణ చేసే వరకు కులపతిని ప్రభుత్వమే నియమించేది. ఆర్డీయూ కేటీకి సైతం కులపతిగా గవర్నర్ ఉండేలా చట్టానికి సవరణ తీసుకురానున్నారు. ఈ అంశాన్ని కొత్తగా రూపొందిస్తున్న ఏకీకృత చట్టంలో పెడతారు. ప్రస్తుత ఆర్టీయూకేటీ చట్టం ప్రకారం ఉపకులపతికి ఎక్కువ అధికారాలు లేవు. కులవతికే ఎక్కువ అధికారాలున్నాయి. ఇందులోనూ మార్పు తీసుకువస్తారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలకు ఉన్న పాలకవర్గాన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ)గా పిలుస్తున్నారు. ఈసీ స్థానంలో విదేశాల్లో ఉండే విధానంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ను తీసుకువస్తారు. విద్యా సంస్థలను పరిశ్రమలతో అనుసంధానించి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు దీన్ని అమలు చేస్తారు. బోర్డు ఆఫ్ గవర్నర్స్ పారిశ్రామికవేత్తలను సైతం నియమించుకునే అవకాశం ఉంటుంది. దీంతో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్లో మార్పు నైపుణ్య శిక్షణ, కొత్త కోర్సులు, ప్రవేశపెట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఈసీలో వీసీ, ప్రిన్సిపాల్, ప్రొఫెసర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకుడు, వివిధ రంగాలకు చెందిన ప్రభుత్వం నియమించిన వ్యక్తులు సభ్యులుగా ఉంటున్నారు. సిలబస్లో మార్పు, విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చడం లాంటి వాటిపై చర్చిస్తున్న దాఖలాలు లేవు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో వర్సిటీల పరిధుల అస్పష్టత
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో విశ్వవిద్యాలయాల పరిధులపై కొంత అస్పష్టత నెలకొంది. గత ప్రభుత్వంలో ఒక వర్సిటీ పరిధి లోని కొన్ని డివిజన్లు వేరే జిల్లాలో కలపడం, రెండు జిల్లాల్లోని ప్రాంతాలలో కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. ఏ జిల్లాను ఏ వర్సిటీ పరిధి లోకి తీసుకురావాలనే దానిపై అప్పట్లో స్పష్టత ఇవ్వలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో ఉంది. ఈ జిల్లాలో కలిపిన రంపచోడవం ఆదికవి నన్నయ వర్సిటీలో ఉంది. మన్యం జిల్లాలోని పార్వతీపురం ఆంధ్ర వర్సిటీ పరిధిలో ఉండగా… పాలకొండ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీలో ఉంది. ప్రకాశం జిల్లా లోని చీరాల డివిజన్ ను బాపట్ల జిల్లాలో కలిపారు. బాపట్ల డివిజన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉండగా, చీరాల డివిజన్ లోని మండలాలు ఆంధ్రకేసరి వర్సిటీలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా లోని కందుకూరు డివిజన్ ను నెల్లూరు జిల్లాలో కలిపారు. కందుకూరు డివిజన్ లోని ఐదు మండలాలు ఆంధ్రకేసరిలో ఉన్నాయి. రాయలసీమ జిల్లాలు, నెల్లూరు శ్రీవెంకటేశ్వర రీజియన్ పరిధిలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఆంధ్ర వర్సిటీ రీజియన్లో ఉంది. స్థానిక రిజర్వేషన్లోనూ మార్పు ఏర్పడింది. దీనిపైనా ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: