(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ, ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ వద్ద బలమైన వాదనలు వినిపించకుండా, కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాకుండా ఇప్పుడు ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. ఐదేళ్లు ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌కు అప్పుడు సీమకు నీళ్లివ్వాలని గుర్తుకురాలేదా? అని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి, సీమ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆమె విమర్శించారు.
Read Also: Chandrababu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు సంగమేశ్వరం వద్ద కాకుండా ముచ్చుమర్రి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పడాన్ని కూడా షర్మిల తప్పుబట్టారు. ఎవరిని మోసం చేయడానికి ఇద్దరూ కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారు? మోదీ దగ్గర సాగిలపడి సీమకు అన్యాయం చేస్తారా? అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఇద్దరు నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: