📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

AP: చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ జెండా రంగులు..

Author Icon By Rajitha
Updated: December 21, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన ఒక సంఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం కాన్వాయ్‌లో వైసీపీ రంగులు, మాజీ ఎంపీ ఫొటో ఉన్న అంబులెన్స్‌లు కనిపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కశింకోట మండలం తాళ్లపాలెం హెలీప్యాడ్ నుంచి బంగారయ్యపేట సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి ప్రయాణించే సమయంలో కాన్వాయ్‌లో రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. వాటిపై గత ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన బి. సత్యవతి ఫొటోతో పాటు వైసీపీకి (ycp) చెందిన రంగులు స్పష్టంగా దర్శనమిచ్చాయి. ముఖ్యమంత్రి స్థాయి పర్యటనలో ప్రత్యర్థి రాజకీయ పార్టీ గుర్తులు ఉన్న వాహనాలు ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది.

Read also: AP Schools: ఏపీ ప్రభుత్వ స్కూల్‌లలో ముస్తాబు కార్నర్ తో పరిశుభ్రత యోచన

YSRCP flag colors in Chandrababu’s convoy

కాన్వాయ్‌లో ఉపయోగించే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం

ఈ అంశంపై వివాదం తలెత్తడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి హైమావతి స్పందించారు. గతంలో ఎంపీ నిధులతో ఈ అంబులెన్స్‌లు కొనుగోలు చేసినవని, అందుకే ఫొటోలు ఇప్పటికీ మారలేదని తెలిపారు. సీఎం పర్యటనకు నాలుగు అంబులెన్స్‌లు అవసరం కావడంతో అందుబాటులో ఉన్న వాహనాలను వినియోగించామని వివరణ ఇచ్చారు. అయితే, ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉపయోగించే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫొటోలు, పార్టీ రంగులు తాత్కాలికంగా అయినా తొలగించాల్సిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anakapalli Chandrababu Naidu latest news Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.