📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది

AP: కేజీ మామిడికి రూ.8 ఇవ్వాల్సిందే

Author Icon By Saritha
Updated: December 23, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కలెక్టరేట్ ఎదుట మామిడి రైతుల ధర్నా

చిత్తూరు : ఈ సీజన్లో వల్స్ ఫ్యాక్టరీలకు మామిడి (AP) ఇసరఫరా చేసిన రైతులకు వల్స్ ఫ్యాక్టరీలు కేజీకి రూ.8 చెల్లించాల్సిందేనని మామిడి రైతులు డిమాండ్ చేశారు. మామిడి రైతులకు ఫ్యాక్టరీల ఈ సీజన్లో ఇసరఫరా చేసిన మామిడి కాయలకు రైతులకు కేజీకి ఇవ్వాల్సిన రూ.8 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మామిడి రైతులు సోమవారం మామిడి రైతుల సంఘం అధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా మామిడి రైతలు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్రెడ్డి, బంగారు మురళీలు మాట్లాడుతూ ఫ్యాక్టరీలు మామిడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలకు రైతులు మామిడి సరఫరా చేసి ఏడు నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ రైతులకు ఫ్యాక్టరీలు చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు.

మామిడి రైతులు మళ్ళీ సీజనక్కు పెట్టుబడులు పెట్టాల్సిన సమయంలో వారి వద్ద డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని, సత్వరం రైతులకు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్న 40 ఫ్యాక్టరీల వైపా లేక జిల్లాలోని 40 వేల మామిడి రైతుల వైపా! తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పటి వరకు కేజీపై రూ.2, రూ.3, రూ.4, రూ.5, రూ.6 రైతులకు చెల్లించాయని, మిగిలిన మొత్తంను సైతం సత్వరం చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న సంవత్సరంలో మే నెలలోనే వల్స్ ఫ్యాక్టరీలు ప్రారంభించాలని, టేబుల్ రకాల కాయలు రైతులు నేరుగా విక్రయించుకోవడానికి ప్రభుత్వం పట్టణాల్లో ఏర్పాట్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Read Also: AP: క్యాబినెట్ భేటీ వాయిదా

బకాయిల చెల్లింపుపై కలెక్టర్‌కు వినతిపత్రం

ప్రస్తుతం గుజ్జు పరిశ్రమల వద్ద నిల్వ వున్న మామిడి పల్స్ను టిటిడి దేవస్థానం, పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం, ఆంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తే పల్ప్ ఫ్యాక్టరీ యాజమాన్యాల వద్ద వున్న పల్స్ అమ్ముడు పోతుందని దీనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.(AP) గతంలో పలుమార్లు మామిడి రైతుల సమస్యలపై కలెక్టర్తో చర్చలు జరిపినా సమస్యలు పరిష్కరించు కోకపోవడం దారుణహన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రామానాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు హేమలత, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఓయిల్ రాజు, జానపద వృత్తి కళాకారుల సంఘ అధ్యక్షులు కెఎస్ రామచంద్రన్, సంజీవరెడ్డి, ఉమాపతినాయుడు, మోహన్రెడ్డి, త్యాగరాజులు, పెద్ద ఎత్తున మామిడి రైతులు పాల్గొన్నారు. అనంతరం మామిడి రైతు సంఘ నాయకులు కలెక్టర్ సుమిత్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.

మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 31,929 మంది మామిడి రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.146.84 కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీని జన చేసిందని కలెక్టర్ సుమిత్కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం మామిడి రైతులు కలెక్టర్ సుమిత్కుమార్ను కలిసి తమకు పల్ప్ ఫ్యాక్టరీలు కేజీపై వెల్లించాల్సిన రూ.8 చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మామిడి రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, జిల్లాలో మామిడి బోర్డు ఏర్పాటుకు సీఎం నారా చంద్రబాబునాయుడు,(CM Chandrababu) ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందన్నారు. జిల్లాలో తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించిన రైతు నాయకుల్లో మురళీ, విశ్వేశ్వర్రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు వున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Agricultural Issues Chittoor district Farmers Dharna government subsidy Latest News in Telugu Mango Board Mango farmers Mango Price Protest Pulp Factories Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.