📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP: మహిళా సంఘాలకు స్మార్ట్ కిచెన్ల బాధ్యతలు

Author Icon By Anusha
Updated: December 21, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం మహిళా సంఘాలకు మరో శుభవార్త అందించింది. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో లబ్ధిదారులకే కాకుండా మహిళా సంఘాల సభ్యులకు కూడా విస్తృతంగా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Manamitra: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త

విద్యార్థుల ఆకలి తీర్చేందుకు తీసుకు వచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఏపీ (AP) ప్రభుత్వం.. స్మార్ట్ కిచెన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ స్మార్ట్ కిచెన్ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సీకేదిన్నె, కడప, జమ్మలమడుగులో.. ఐదు స్మార్ట్ కిచెన్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి.

ఈ సంఘాలు వంట వండటం మాత్రమే కాక.. ఆహార భద్రత, శుభ్రత, ప్యాకింగ్, సమయానికి భోజనం అందించడంతో పాటుగా.. వ్యర్థాల నిర్వహణ, పరిమాణ నియంత్రణ వంటి అన్ని పనులను పర్యవేక్షిస్తున్నాయి.ఈ క్రమంలో త్వరలో ప్రారంభించబోయే మరో 33 స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచడానికి గాను..

AP: Women’s groups responsible for smart kitchens

కూరగాయల సాగులో శిక్షణ ఇవ్వడం

సేంద్రియ కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు.ఇందుకు గాను మహిళా సంఘాలు.. ఏపీసీఎన్‌ఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్) కింద సేంద్రియ కూరగాయలను పండిస్తున్నాయి. వీరికి కూరగాయల సాగులో శిక్షణ ఇవ్వడంతో పాటుగా.. ప్రోత్సాహకాలు అందించి..

అలా పండించిన కూరగాయాలను స్మార్ట్ కిచెన్లకు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండల సమాఖ్యలు కూడా ఈ విషయంలో సహాయం చేస్తున్నాయి. సేంద్రియ కూరగాయల వాడకం వల్ల భోజనం పోషక విలువలు పెరగడమే కాకుండా, మహిళల జీవనోపాధి కూడా మెరుగుపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Government latest news Mid Day Meal Program Smart Kitchen Scheme Telugu News Women Self Help Groups

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.