వచ్చే సంవత్సరం, 2026 జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరు జిల్లాలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు (Telugu Conference) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పాటు 22 సాహితీ సదస్సులు నిర్వహించనున్నారు. ఇప్పటికే 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానాలు పంపారు. నందమూరి తారక రామారావు పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు కానుంది. ఈ సభలకు తెలుగువారి అనురాగ సంగమంగా నామకరణం చేశారు. 3రోజుల్లో లక్ష మంది వస్తారని అంచనా.
Read Also: AP: ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు
ఈ మహాసభలను విజయవంతం చేయాలి
ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డితోపాటు మరో మూడు రాష్ట్రాల్ల గవర్నర్లు హాజరు కానున్నారు. 22 సాహితీ సదస్సులు, తెలుగు భాషా పరిరక్షణ, సాహిత్యాభివృద్ధి, సాంస్కృతిక వైభవంపై చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పురస్కారాల ప్రదానం ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. గతంలో 2017లో హైదరాబాద్ లో, 2024లో రాజమహేంద్రవరంలో జరిగిన మహాసభల (Telugu Conference) విజయవంతమైంది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: