ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే పంపిణీ చేయనుంది. మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.80 వరకు ఉన్న ధరలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. తొలుత జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలుకానుంది.
Read Also: DyCM Pawan: Dy.CM ఆదేశాలతో AP అటవీ ప్రాంతాల్లో వన్యజంతు భద్రతా చర్యలు
గోధుమలను రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయిస్తోంది
ఈ పథకాన్ని మొదట 26 జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యపట్టణాలు, నగరాల్లో అమలు చేయనున్నారు. ప్రతి రేషన్ కార్డుకు కిలో చొప్పున గోధుమ పిండిని పంపిణీ చేయడానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చర్యలు తీసుకుంటోంది. జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్రం నెలకు 1,838 టన్నుల గోధుమలను (AP) రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయిస్తోంది. కేంద్రం కేటాయించిన గోధుమలను ఎఫ్‌సీఐ (FCI) ద్వారా తీసుకున్న రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ,
వాటిని నాణ్యమైన గోధుమ పిండిగా మార్చి, ప్రతి రేషన్ కార్డుకు ఒక కిలో చొప్పున ప్యాకెట్లలో పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల చివరి నాటికి అన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు ఈ పిండిని చేర్చి, జనవరి 1 నుంచి కార్డుదారులకు అందజేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ గోధుమ పిండిని తీసుకోవడానికి రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపిస్తే, వారి డిమాండ్‌ను బట్టి రాష్ట్రంలోని కార్డుదారులందరికీ ప్రతి నెలా సబ్సిడీపై గోధుమ పిండిని సరఫరా చేసేందుకు పౌరసరఫరాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: