📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Weather: బాబోయ్! అప్పుడే సెగలు పుట్టిస్తున్న ఎండలు

Author Icon By Tejaswini Y
Updated: February 9, 2026 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి కాలం ముందే మొదలైనట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలోనే ఎండల తీవ్రత గణనీయంగా పెరగడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ఆదివారం నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత వేడిగా ఉన్న ప్రాంతంగా నిలిచింది.

Read Also: Beliefs Vs Science: నాలుకపై మచ్చ: అదృష్టమా?

AP Weather: Wow! The sun is just starting to shine!

తీర ప్రాంతాల్లో భానుడి ప్రతాపం

ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాలైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, బాపట్ల, ప్రకాశం జిల్లా ఒంగోలుతో పాటు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు(Temperatures) సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు భగభగలాడుతుండటంతో రానున్న మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మార్చి నెలలో కనిపించే వేడి ఈసారి ఫిబ్రవరిలోనే మొదలవ్వడం వాతావరణ మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AP Weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.