ద్రోణి ప్రభావం (Trough effect) తో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. రానున్న రెండు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు (thunderstorms with lightning) కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
SIPB : ఏపీలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్
ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ (Prakhar Jain) బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.గురువారం రోజున అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం జిల్లాలు మినహా దాదాపు అన్నిచోట్లా పిడుగులతో (with thunderbolts) కూడిన వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని వివరించారు.
మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ఇక రాబోయే మూడు గంటల్లో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని,
పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: