ఆంధ్రప్రదేశ్ (AP),యానాం ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దిగువ ట్రోపోస్ఫియర్ ఆవరణంలో నైరుతి దిశగా వీస్తున్న గాలులు ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ గాలుల ప్రభావం తీరప్రాంతాలతో పాటు జిల్లాలపై కూడా కనిపించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Read Also: IPS Transfer: ఆంధ్రాలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
ఇవాళ బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA (Andhra Pradesh State Disaster Management Authority) అంచనా వేసింది. ఈ జిల్లాల్లో వాతావరణం, ఆకాశం మేఘావృతంగా మారి, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: