ఆంధ్రప్రదేశ్ (AP Weather) పై ప్రభావం చూపిస్తున్న దిత్వా తుఫాన్ బలహీనపడింది. తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతూ భయపెట్టిన తుఫాన్.. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ తుఫాన్ సోమవారం ఉదయానికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.’దిత్వా’ ప్రభావంతో ఏపీ (AP Weather) లో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది.
Read Also: Greenfield Highway: విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
భారీ వర్షాలలు
కోనసీమ, ప.గో., కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు.. కాకినాడ, తూ.గో., ఏలూరు, NTR తదితర జిల్లాల్లోనూ మోస్తరు వానలకు అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: