📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: AP: ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా రుషికొండ ప్యాలెస్ ను వినియోగిస్తాం

Author Icon By Saritha
Updated: December 17, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేబినెట్ సబ్కమిటీ స్పష్టీకరణ సచివాలయంలో భేటీ… విస్తృత చర్చ

సచివాలయం : పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా, ప్రజలకు కూడా ఉపయోగపడేలా రుషికొండ ప్యాలెస్పై(AP) త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రుషికొండ ప్యాలెస్ను ఏవిధంగా వినియోగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ రెండో భేటీ మంగళవారం వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం ఎండి, ఎపిటిఏ సీఈవో అమ్రపాలి సుదీర్ఘంగా చర్చించారు. గత భేటీలో సూచనల మేరకు ప్రజలు, స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాన్ని పర్యాటక శాఖ అధికారులు సబ్ కమిటీ ముందుంచారు. రుషికొండ ప్యాలెస్ను ఏవిధంగా వినియోగించాలన్న అంశంపై వెబ్సైట్లో స్పందన కోరగా 1517మంది ప్రజలు, 44మంది స్టేక్ హోల్డర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని తెలిపారు. అత్యధిక శాతం ప్రజలు గత ప్రభుత్వం చేసిన తప్పును త్వరితగతిన సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరారని వెల్లడించారు. మరి కొందరు హోటల్, రిసార్ట్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, సైన్స్ ప్లానిటోరియం, మైస్, వెల్నెస్ సెంటర్గా.

Read also: Aman Rao: ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక

We will utilize the Rushikonda palace in a way that generates revenue for the government.

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష

ప్రభుత్వ కార్యాలయంగా(AP) వినియోగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తంచేసినట్లు సబ్ కమిటీ వెల్లడించింది. అంతిమంగా సంస్థల సమర్థతను పరిగణనలోనికి తీసుకొని ప్రజలకు ఉపయోగపడుతూనే, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టేలా రుషికొండ ప్యాలెస్ను వినియోగించేలా నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫలక్నామా ప్యాలెస్ కట్టడాన్ని సహజత్వం కోల్పోకుండా ఏవిధంగా వినియోగిస్తు న్నారనే అంశాన్ని ఉదహరించారు. ఈ సందర్భంగా మంత్రులు వయ్యావుల, కందుల, డోలా మాట్లాడుతూ గత ప్రభుత్వం రుషికొండపై పర్యాటక శాఖకు అధిక ఆదాయాన్ని చ్చే హరిత రిసార్ట్స్ స్థానంలో విజయనగర, కళింగ, చోళ, పల్లవ, గజపతి, వేంగి, ఈస్టర్స్ గంగ తదితర పేర్లతో కూడిన 7 బ్లాక్లతో 19,968 చ. మీ రాజప్రసాదంలాంటి ప్యాలెస్ను నిర్మించి ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేసిందని విమర్శించారు.

ప్రజలకు ఉపయోగకరంగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా నిర్ణయం

గత ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రస్తుతం ప్రతినెలా 25-30లక్షల మెయింటెనెన్స్ చార్జీల భారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన వినియోగంలోనికి తీసుకొచ్చేందుకు ప్రజలు, స్టేక్ హోల్డర్స్ అబిప్రాయాన్ని తీసుకున్నామని, త్వరలోనే దీన్ని పర్యాటక శాఖకు ఆదాయం వచ్చేలా ప్రజలకు ఉపయోగపడేలా సముచిత నిర్ణయం తీసుకుంటా మన్నారు. ఇప్పటికే టాటా, అట్మోస్పియర్ కోర్, ఐహెచ్సీఎల్, హెచ్ఐ తదితర సంస్థలు ప్యాలెస్ను ఏ విధంగా వినియోగిస్తే బాగుంటుందో తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వెలిబుచ్చాయని, మరికొని విదేశీ సంస్థలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తంచేశాయన్నారు. కొన్నింటికి పూర్తిస్థాయి స్పష్టం రావాల్సి ఉందన్నారు. మరో భేటికి పూర్తి స్పష్టత వస్తుందని, అనంతరం ప్రతిపాదనలు కేబినెట్ దృష్టికి తీస్కెళ్ళి ఆ తర్వాత సీఎం చంద్రబాబు(CM Chandrababu) సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సాధ్యమైనంత త్వరగా రుషికొండ ప్యాలెస్పై కీలక నిర్ణయం తీసుకుంటామని సబ్ కమిటీ పేర్కొంది. సమావేశంలో పర్యాటక శాఖ అధికారులు రుషికొండ ప్యాలెస్కు సంబంధించిన ప్రజంటేషన్ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh Government Cabinet Sub Committee Latest News in Telugu Rushikonda Palace Secretariat meeting Telugu News Tourism Department

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.