నరసరావుపేట (పల్నాడుజిల్లా) : (AP) రాష్ట్రంలోని దేవాలయాల లో జరిగే ప్రతి పూజా, ప్రతి కైంకర్యములో సామాన్య భక్తులకే పెద్ద పీట వేయాలని కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు. త్రికోటేశ్వర స్వామి తిరుణాళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈనెల 15 వ తేదీన జరగ నున్న కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై బుధవారం మంత్రి ఆనం ఆధ్వర్యంలో మూడవ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఆనం, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ చదల వాడ అరవిందబాబు, జీవీ, ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొన్నారు.
Read Also: Ap: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 140 మీటర్ల వెడల్పుతోనే
కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణకు రూ.30 లక్షలు మంజూరు
ఈ సందర్భంగా మంత్రి ఆనం మహాశివరాత్రి నిర్వహించే కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణకు రూ.30 లక్షలు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. (AP) త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో ఉన్న భక్తులకు మజ్జిగ, మంచినీటి సదుపాయాలు అందించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు చిన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాల న్నారు. క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు నిలబడ కుండా వెంటనే దర్శనం కలిగించేలా చర్యలు తీసుకోవా లని అధికారులకు సూచించారు. వీఐపీ పాసుల విషయంలో గత అనుభవాల దృష్ట్యా వీఐపీ టికెట్లు మంజూరు చేయనున్నామన్నారు. వీఐపీ దర్శన టికెట్ల ఫిబ్రవరి 10 14 వరకూ ఆన్ లైన్ లో సైతం బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. వీఐపీలు వాళ్లకు ఇచ్చిన టైం స్లాట్లో మాత్రమే దర్శనం చేసు కునేలా చూడాలన్నారు.
స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ
త్రికోటేశ్వర స్వామిని దర్శించు కున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ అందజేస్తా మన్నారు. ఈనెల 12వ తేదీ లోపు తిరుణాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికా రులను ఆదేశించారు. త్రికోటేశ్వర స్వామి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. వృద్ధులు, వికలాం గుల దర్శనానికి అవసరమైన వాహనాలు, ఇతర ఏర్పాట్లు జాగ్రత్తగా చూడలని దేవాదాయ శాఖ అధికా రులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులకు సూచిం చారు. తిరునాళ్ల సమయంలో లో ఓల్టేజ్, విద్యుత్ అంతరాయాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
కొండపైన ఉండే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ గత సంవత్సరం శివరాత్రికి 550 బస్సులు నడిపామని, ఈ సంవత్సరం అంతకుమించి 618 బస్సులు కేటాయించామన్నారు. కేవలం కొండ మీద నుంచి కిందకు భక్తులను తరలించేందుకు 95 బస్సులు కేటాయించామన్నారు. శివరాత్రికి రాత్రి పూట కొండపైన ఉండే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభల సమయంలో వెలుతురు నాణ్యత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా తిరునాళ్లకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే అరవిందబాబు సూచించారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల దృష్ట్యా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా శానిటేషన్ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ప్పంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
సమిష్టి కృషితో కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేసి జిల్లా ప్రతిష్టను మరింత పెంచాలని పిలుపునిచ్చారు. కోటప్పకొండ తిరుణాళ్లకు 30 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిన మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎస్పి బి. కృష్ణారావులు మాట్లా డుతూ సామాన్య భక్తునికి స్వామి వారి దర్శనం సులభంగా లభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటా మన్నారు. చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో తిరు ణాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎస్పీ బి కృష్ణారావులు పిలుపునిచ్చారు.
త్రికోటేశ్వరునికి మంత్రుల ప్రత్యేక పూజలు
ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండలో బుధవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్చార్జి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, దేవస్థానం ధర్మకర్త కొండలరావు బహుదూర్, ఆలయ ఈవో డి చంద్రశేఖర రావు పూర్ణకుంభం తో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రుల వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, పత్తిపాటి పుల్లారావు, బ్రహ్మారెడ్డి, దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి, లలిత్, ఆర్డీవో మధులత వారి వెంట ఉన్నారు. త్రికోటేశ్వరుని దర్శనం అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ప్రత్యేక చిత్రపటాన్ని, శేష ఈ సందర్భంగా అధికారులు అందజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: