వచ్చే ఉగాదికి అర్హులైన పేదలకు దాదాపు 5లక్షల ఇళ్లు పంపిణీ చేస్తామని ఏపీ (AP) సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) తెలిపారు. ‘హౌస్ ఫర్ ఆల్’ కాన్సెప్ట్ తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. 2019-2014 మధ్య 18లక్షల ఇళ్లు మంజూరు అయితే కనీసం 4లక్షల ఇళ్లు కూడా కట్టలేదని గత వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు.
Read Also: Kiren Rijiju: డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు
ప్రతి మూడునెలలకు ఒకసారి గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాన్ని సమదృష్టితో చూస్తూ తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
ప్రజల సమస్యలపై ఫోకస్
రైతుల సమస్యలు, ప్రజల సమస్యలను తెలుసుకుని ఆర్టీజీఎస్ నుంచి పరిష్కారంపై దృష్టి పెడుతున్నామని, హౌసింగ్ అన్నిటికన్నా ముఖ్యమైనదని అన్నారు. 16నెలల్లో 3లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని ఆయన అన్నారు. అందరికీ సొంత ఇల్లు అనే దృష్టితో ముందుకు సాగుతున్నామని మంత్రి పార్థసారథి అన్నారు. 5లక్షలు పీఎంఈవై కింద గ్రామీణ పాంతాల్లో ఇస్తున్నామన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: