📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP: వచ్చే నాలుగేళ్ళలో 12.59లక్షల గృహాలను పూర్తిచేస్తాం

Author Icon By Sushmitha
Updated: November 26, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సచివాలయం: AP రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathi) తెలిపారు. ఐదేళ్లలో 15.59 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందని, ఇందులో ఇప్పటికే 3.00 లక్షల గృహాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 12.59 లక్షల గృహాలను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

Read also : CM Chandrababu : నిధులతో పూర్వోదయ రాయలసీమ అభివృద్ధి

AP We will complete 12.59 lakh houses in the next four years

గృహ నిర్మాణ లక్ష్యాలు, ప్రణాళికలు

మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే పూర్తిచేసిన 3.00 లక్షల గృహాలతోపాటు వచ్చే ఉగాదికి 5.00 లక్షల గృహాలను, జూన్ కల్లా మరో 87 వేల గృహాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

PMAY పొడిగింపు: పీఎంఏవై-1.00 పథకం అమలు గడువును కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించిన నేపథ్యంలో, ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రారంభం కాని 3.03 లక్షల గృహాలను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఈ గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ సభ్యులు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ఎంతో దురదృష్టకరమన్నారు.

గత, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరుపై పోలిక

ఐదేళ్ల కాలంలో గత ప్రభుత్వం కేవలం 6.00 లక్షల గృహాలను మాత్రమే పూర్తి చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల కాలవ్యవధిలోనే 3.192 లక్షల గృహాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. 2014-19 లో తమ ప్రభుత్వ హయాంలో 8.687 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు.

గత ప్రభుత్వంపై ఆరోపణలు: 2014-19 మధ్యకాలంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద మంజూరు చేసి వివిధ దశల్లో ఉన్న 4.7 లక్షల గృహాలను గత ప్రభుత్వం రద్దు చేయడమే కాకుండా, పూర్తయిన 2.7 లక్షల గృహాలకు రూ.920 కోట్లు చెల్లింపు చేయకుండా ఎగ్గొట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల వారికి అన్యాయం చేయడం జరిగిందన్నారు. అయితే తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పక్షపాత ధోరణితో ఏమాత్రం వ్యవహరించకుండా గత ప్రభుత్వం మంజూరుచేసి 18.61 లక్షల గృహాల్లో మిగిలి ఉన్న 11.90 లక్షల గృహ నిర్మాణాలను కొనసాగించడం జరుగుతుందన్నారు.

ఇళ్ల స్థలాల సర్వే, పొజిషన్ సర్టిఫికేట్లు

ఇళ్ల స్థలాలు కావాల్సిన వారిని గుర్తించేందుకు చేస్తున్న సర్వేలో ఇప్పటివరకు 81 వేల మందికి ఇళ్ల స్థలాలు కావాల్సి ఉందనే విషయాన్ని గుర్తించడం జరిగిందన్నారు. అదే విధంగా దాదాపు 1.15 లక్షల మందికి ప్రభుత్వం, పోరంబోకు స్థలాల్లో ఉంటున్నవారికి పొజిషన్ సర్టిఫికేట్లు అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.

గృహ నిర్మాణాల్లో అవకతవకలు, ‘రాక్రీట్’ సంస్థపై చర్యలు

గృహ నిర్మాణాల విషయంలో గతంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ నివేదిక అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నివేదిక ప్రకారం రాక్రీట్ నిర్మాణ సంస్థ గృహ నిర్మాణాల విషయంలో పలు అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు. ఈ సంస్థకు 50,402 ఇళ్ల నిర్మాణ పనులను అప్పగించడం జరిగిందని, అయితే వీటిలో 47,850 గృహ నిర్మాణాలను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసి గృహ లబ్ధిదారులను తీవ్ర అన్యాయానికి గురిచేయడం జరిగిందన్నారు.

దాదాపు రూ.80 కోట్ల మేర అవినీతికి ఈ సంస్థ పాల్పడినట్లు వెల్లడైందని, ఈ సొమ్మును ఆ సంస్థ నుండి రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు, ఏఏ జిల్లాల్లో అవకతవకలకు పాల్పడటం జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్‌గా అవకాశం ఉన్న అన్ని రకాల కేసులను నమోదు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Andhra Pradesh housing Coalition Government Google News in Telugu housing corruption Kolusu Parthasarathy Latest News in Telugu PMAY scheme Rakreet Constructions Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.