📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: AP: విశాఖలో గోమాంసం నిల్వలపై పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు

Author Icon By Saritha
Updated: November 15, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నంలో(AP) భారీగా అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కఠినంగా స్పందించారు. ఈ దందాకు సంబంధించిన ముఠాల అసలు మూలాలను వెంటనే గుర్తించాలంటూ పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. కేసులో ఎంతటి వ్యక్తులు ఉండినా క్షమించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు. విషయం బయటపడిన వెంటనే ఆయన స్వయంగా పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి మొత్తం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Read also: విమాన ప్రమాదంలో మృతురాలి కుటుంబానికి 317 కోట్లు

విశాఖలో గోమాంసం నిల్వలపై పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు

1.89 లక్షల కిలోల గోమాంసం స్వాధీనం

డీఆర్ఐ(AP)అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజీపై దాడి నిర్వహించి 1.89 లక్షల కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసును పోలీసులకు అప్పగించారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వహకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ పవన్ కల్యాణ్‌కు తెలిపారు. మాంసం ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడికి తరలించాలనుకున్నారు, అనుమతుల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. తప్పిదం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.

పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ, అక్రమ గోవధ, గోమాంసం సరఫరా లేదా ఎగుమతులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. తన దృష్టికి వచ్చిన తర్వాత పిఠాపురంలో ఉన్న అక్రమ వధశాలను గతంలో మూసివేయించిన ఉదాహరణను గుర్తుచేశారు. గోవధ నిషేధానికి ఎన్డీయే ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపిస్తుందని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh police Beef Seizure DRI Raids Illegal Slaughter Latest News in Telugu Mitra Cold Storage Pawan Kalyan Telugu News visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.