ఆంధ్రప్రదేశ్ (AP) లోని మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురంలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నిరుపేద వృద్ధ మహిళ చనిపోతే మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం అంబులెన్స్ సదుపాయం కూడా లేదు. దీంతో చెత్త తరలించే రిక్షాపై వృద్ధురాలి మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది.
Read Also: AP: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సు కండక్టర్లకు పవర్ బ్యాంకులు
ప్రైవేటు వాహనానికి రూ. 2,500
వివరాల్లోకి వెళితే.. (AP) మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధమ్మ (65) భర్త, కుమార్తె చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురవడంతో బంధువులు భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆమె మృతిచెందారు.
మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ కోసం ప్రయత్నించగా, అది అందుబాటులో లేదని సిబ్బంది తెలిపారు. ప్రైవేటు వాహనాన్ని సంప్రదిస్తే వారు రూ. 2,500 డిమాండ్ చేశారు. అంత మొత్తం చెల్లించే స్తోమత లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో వారు చెత్త సేకరించే రిక్షాలోనే మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఈ హృదయవిదారక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: