📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: శైవక్షేత్రం ద్రాక్షారామంలో అగంతకుల దుశ్చర్య

Author Icon By Saritha
Updated: December 31, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రామచంద్రపురం : పవిత్ర వైకుంఠ ఏకాదశి రోజున హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ద్రాక్షారామంలో (AP) శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీభీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తర దిశగా సప్త గోదావరి తీరానగల కపాలేశ్వర స్వామి లింగాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు విచ్ఛిన్నం చేసి అదృశ్యమయ్యారు. తెల్లవారుజామున స్వాములు సప్త గోదావరి నదీ స్నానం అనంతరం కపాలేశ్వర స్వామి లింగానికి జలాభిషేకం చేసేందుకు సిద్ధపడగా ఈ దుశ్చర్య బయట పడిందని స్థానికులు చెబుతున్నారు. శివలింగాన్ని ధ్వంసం చేయడాన్ని హైందవ సంఘాల తీవ్రంగా తప్పుపట్టాయి.

Read also: Tirupati: తిరుపతి ఫ్యూచర్ సిటీగా రూపాంతరం

Vandalism by unidentified persons at the Shaivite pilgrimage site of Draksharama.

లింగ విధ్వంసం బాధ్యుల ఆచూకీ, దర్యాప్తు వేగవంతం

ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశాయి. (AP) శివలింగం విధ్వంసం ఘటన వార్త తెలియగానే పోలీస్, దేవాదాయ, పురావస్తు శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. క్షణాల్లో ఆ ప్రాంతాన్ని కట్టుదిట్టం చేశారు. శివలింగం ధ్వంసమైన ప్రాంతాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. పూర్తిస్థాయిలో భద్రత దళాలను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు దేవస్థానానికి చేరుకుని లింగ విధ్వంసానికి పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం ప్రయత్నాలు మమ్మరం చేశారు. ఘటనకు సంబంధించిన నిందితులను గుర్తించేందుకు ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. దీనిలో భాగంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీములు రంగ ప్రవేశం చేశాయి. అన్ని కోణాల్లో విచారణ చేసి దోషులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



Ambedkar Konaseema SP Hindu Community Protest Kapaleswara Swamy Temple Latest News in Telugu police investigation Shiva Linga Vandalism Telugu News Temple Security

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.