విజయవాడ: ఈ ఏడాది మహిళా, శిశు సంక్షేమ శాఖల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అందులో భాగంగా మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చాం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 వేల మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీలుగా మార్చాం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 వేల మినీ అంగన్వాడీలను అప్ గ్రేడ్ చేశామన్నారు. అంతేకాకుండా అంగన్వాడీలకు సెలఫోన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు మెరుగైన సేవలు అందించడానికి పాత 4జీ ఫన్ల స్థానంలో 5జీ స్మార్ట్ ఫోన్లను కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు.
Read also: AP Govt:విద్యార్థినులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు!
Upgradation of mini Anganwadi centers
తద్వారా క్షేత్రస్థాయి నివేదికలు వేగవంతం అవుతాయని, గర్భిణీలు, తల్లులు, పిల్లలకు సేవలు సమర్థవంతంగా అందుతాయని వివరించారు. రాష్ట్రం లోని గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకండా రహదారుల సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. తద్వారా గర్భిణులు, అనారోగ్యంతో బాధపడే వారు ఆస్పత్రికి తీసుకెళ్ళేందుకు ఇబ్బందులను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంత వాసులు సౌక ర్యవంతమైన రోడ్డు ప్రయాణం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి పెద్ద పీట వేస్తోందన్నారు.
అందులో భాగంగా గిరిజన రైతుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అన్ని ఐటీ ఏలకు రూ.13.70కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. 9 ఐటీడీఏల పరిధిలో ట్రైకార్ రుణాలను పునరుద్దరించామన్నారు. గిరిజన రైతులకు 90శాతం భారీ సబ్సిడీతో ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, ట్రక్కులు, ఆయిల్ ఇంజిన్లు, టార్పాలిన్లు పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. అంతే కాకుండా పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం కల్పించేందుకు గోకులాలు మంజూరు చేస్తున్నా కీలక నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రానున్న 2026లో మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: