📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

AP: విశ్వవిద్యాలయాలు సమర్ధంగా పనిచేసి ర్యాంకింగ్స్ మెరుగుపర్చాలి

Author Icon By Saritha
Updated: January 6, 2026 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్ధుల్ నజీర్

విజయవాడ, : (AP) మన విశ్వవిద్యాలయాలు విద్యా పరిపక్వతలో వివిధ దశల్లో ఉన్నాయి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్ధుల్ నజీర్ (Syed Abdul Nazeer) అన్నారు. ఈ పరిస్థితి మెరుగువడాల్సి ఉందన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని 25 పబ్లిక్ విశ్వవిద్యాలయాలలో, కేవలం ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే తొలి 50లో స్థానం సాధించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం టాప్ 100లో ఉంది. (AP) ఈ ర్యాంకింగ్స్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపర్చడం, టాప్ 100లో చోటు సంపాదించడానికి ప్రయత్నించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని అన్నారు.. విజయవాడ నోవాటెల్ లో పబ్లక్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ల సమావేశంలో గవర్నర్ జస్టిస్ సయ్యద్బ్దుల్ నజీర్ అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య ప్రస్తుత స్థితి, భవిష్యత్తులో దాన్ని మరింత బలోపేతం చేయడానికి ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడానికి ఈ సమావేశం ఒక చక్కటి వేదిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విసృతమైన, సమగ్ర ఉన్నత విద్యా వ్యవస్థను నిర్మించింది.

Read also: Srikalahasti: శివరాత్రికి లక్షలాది భక్తులు.. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

నైతిక విలువలను ప్రోత్సాహించడం

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగి యువత ఉన్నత విద్య ప్రవేశానికి మార్గం సులువైంది. (AP) విశ్వవిద్యాలయాలు విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, నైతిక విలువలను ప్రోత్సహించే విద్యా వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేయాలి. నాణ్యతను బయటి అవసరంగా కాకుండా, అంతర్గత సంస్కృతిగా చూడాలి. అది రోజువారీ నిర్ణయాలు, దీర్ఘకాల ప్రణాళికలను మార్గనిర్దేశనం చేస్తుంది. స్వామి వివేకానంద చెప్పినట్లుగా విద్య అంటే మెదడును నింపడం కాదు, మనసును శిక్షణ ఇవ్వడం.” అంటే విద్య అనేది భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా మనసును తీర్చిదిద్దడం కేవలం పాఠాలు కంఠస్థం చేసుకోవడం కాదు, విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి తెలుసుకునేలా బోధన చేపట్టాలి. తదుపరి సవాలు ఏమిటంటే మన విశ్వవిద్యాలయాల్లో చేరే ప్రతి విద్యార్థి తన విద్యను ధైర్యంగా, నైపుణ్యంతో పూర్తి చేసేలా సహాయం చేయడం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులు, తొలి తరం విద్యార్థుల అవసరాలపై విశ్వవిద్యాలయాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమానత్వం అనేది కేవలం ప్రవేశ గణాంకాల్లోనే కాకుండా… విద్యార్థుల విజయాల్లో, వారి జీవన ఫలితాల్లో కూడా ప్రతిఫలించాలి. ఇప్పుడు మనం అసాధారణ సాంకేతిక పురోగతి యుగంలో జీవిస్తున్నాం.

విద్యార్థులను డిజిటల్ నైపుణ్యాలతో, సామర్థ్యంతో తీర్చిదిద్దడం

ఈ నేపథ్యంలో, కేవలం డిగ్రీ మాత్రమే సరిపోదు. విద్యార్థులు అనుకూల నైపుణ్యాలు, డిజిటల్ అవగాహన, నిరంతరం నేర్చుకునే సామర్థంతో తీర్చిదిద్దబడాలి. (AP) ప్రముఖ తత్వవేత్త నికోస్ కజాంల్టాకిస్ గారు చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ప్రముఖ తత్వవేత్త నికోస్ కజాంట్జాకిస్ మాటలను ఈ సందర్భంగా నేను ఉటంకిస్తాను. “ఆదర్శ ఉపాధ్యాయులు విద్యార్థులకు వంతెనలుగా ఉపయోగపడి, తరువాత ఆనందంగా తమ ప్రయాణాన్ని ముగిస్తారు, భవిష్యత్తులో తమ శిష్యులు స్వంతగా వంతెనలను నిర్మించుకునేలా ప్రోత్సహిస్తారు”. విద్యాప్రమాణాలు పెరగాలి.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువతతో పాటు తొలితరం వారికి విశ్వవిద్యాలయాల ప్రవేశాల్లో సమాన అవకాశాలు లభించడం శుభశూచకం. ఉన్నత విద్యలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం కూడా ఆశాజనకమైన, ప్రోత్సాహకరమైన పరిణామం. అయితే 2023-24 సంవత్సరానికి గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం జాతీయ సగటుకంటే రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం ప్రతికూల పరిణామం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:



Andhra Pradesh universities Governor Syed Abdul Nazeer higher education Latest News in Telugu NIRF Rankings 2025 Quality Education rural students Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.