📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: బాలికను చంపి డ్రమ్ములో కుక్కిన పక్కింటి అంకుల్

Author Icon By Saritha
Updated: February 17, 2026 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: అన్నమయ్య జిల్లాలో (Annamaya District) కలకలం రేపిన ఘటన… మదనపల్లెలో మిస్సింగ్ అయిన 7 ఏళ్ల చిన్నారి మృతిగా గుర్తింపు. కులవర్ధన్‌ అనే వ్యక్తి ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. పాప ఇంటికి సమీపంలోనే అతడి ఇల్లు కూడా ఉంది. పాపం బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు నిందితుడు కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు కులవర్ధన్ గతంలో కూడా స్థానిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read Also: budget: ఎంఎస్ఎం రంగానికి భారీ కేటాయింపులు: కొండపల్లి శ్రీనివాస్

AP: Uncle next door who killed girl and stuffed her in a drum

మదనపల్లిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు.. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది. సోమవారం సాయంత్రం బాలిక కనిపించకుండా పోయింది. తల్లిద్రండులు బాలిక కోసం గాలించారు.. ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలించినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పాపను ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్న కులవర్ధన్ దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాప మరణంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

andhra pradesh crime annamayya district Latest News in Telugu Madanapalle News minor girl murder Rape and Murder Case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.