📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: AP: గిరిజన సంస్కృతికి ప్రతిబింబం ఉద్భవ్

Author Icon By Sushmitha
Updated: December 6, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: AP దేశవ్యాప్తంగా వివిధ ఏకలవ్య గిరిజన ఆశ్రమ పాఠశాలల (EMRS) విద్యార్థిని, విద్యార్థుల సంస్కృతి మరియు సంప్రదాయాల సమ్మేళన వేదికైన ‘ఉద్భవ్-2025’ శుక్రవారం విజయవంతంగా ముగిసింది. చివరి రోజు విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు నిర్వహించిన భారీ సభను గుంటూరు జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కందుల దుర్గేష్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయులుతో కలిసి గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

Read Also: Shivraj Kumar: దుర్గమ్మ సేవలో కన్నడ హీరో శివరాజ్ కుమార్

అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ ‘మనమంతా ఒక్కటే’ నని ఈ ఉద్భవ్ ద్వారా గిరిజన బాలబాలికలు ఎలుగెత్తి చెప్పారని ప్రశంసించారు. ఆదివాసీలు ఏ రంగంలోనూ తక్కువ కాదని నిరూపించేలా ఎదగాలని ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు, బిర్సా మొండా లాంటి స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు మరిన్ని నిర్వహిం చే దిశగా పెద్దపీట వేస్తామని ఆమె స్పష్టం చేశారు.

AP Udbhav is a reflection of tribal culture

49 ఈవెంట్లలో 300 మందికి పైగా విద్యార్థులు పతకాలు

గిరిజన బిడ్డల్లో కళా నైపుణ్యాలను ప్రోత్సహించి వారిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఉద్భవ్-2025 సరైన వేదికని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు తరలివచ్చి ప్రతిభ చూపడం అసాధారణ విషయమన్నారు. అడవిలో పుట్టిపెరిగిన వారు సైతం అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ఎన్నో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఏపీ వేదికవుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి వెల్లడించారు. గిరిజనులుగా గర్వపడాలని, గిరిజన సంప్రదాయాన్ని దశదిశలకు వ్యాపింపజేయాలని మంత్రి డోలా పిలుపునిచ్చారు.

సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ, మూడు రోజుల పాటు జరిగిన మొత్తం 49 ఈవెంట్లలో 300 మందికి పైగా EMRS విద్యార్థులు పతకాలు సాధించారని వెల్లడించారు. ఉద్భవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రం అందించనట్లు స్పష్టం చేశారు. మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1558 మంది విద్యార్థులు ఉద్భవ్-2025లో పాల్గొన్నారని నెక్స్ట్ జాయింట్ కమిషనర్ బిపిన్ రాటూరు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AndhraPradesh APMinisters DolaSribalaveeranjaneyulu EMRSSummit Google News in Telugu GummadiSandhyarani KandulaDurgesh Latest News in Telugu Telugu News Today TribalCulturalFest Udbhav2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.