📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్

AP: రామభద్రపురంలో ఇద్దరు గీత కార్మికులు మృతి

Author Icon By Rajitha
Updated: January 27, 2026 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రామభద్రపురం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లాలోని రామభద్రపురం మండల కేంద్రం రామభద్రపురం మెయిన్ రోడ్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనతో రామభద్రపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎస్సై వెలమల ప్రసాదరావు కథనం ప్రకారం ఆదివారం రాత్రి రామభద్రపురం శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన మైనపు తాతయ్య (57), బత్తిన అప్పారావు (35) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. వీరు ఇద్దరు గీత కార్మికులు. మృతులు తాతయ్య, అప్పారావు మామ అల్లుళ్లు అని బంధువులు చెప్తున్నారు. అల్లుడు అప్పారావు కాసిపేట గ్రామానికి చెందినవాడు.

Read also: RTGS review Andhra Pradesh : 2026 టెక్ ఇయరా? పాలనపై చంద్రబాబు కీలక ఆదేశాలు!

Two toddy tappers died in Ramabhadrapuram

మృతుడు మైనపు తాతయ్యకు భార్య పార్వతి, ముగ్గురు ఆడపిల్లలు. మరో మృతుడు బత్తిన అప్పారావుకు భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మామ తాతయ్య ఇంటి నుంచి ఇద్దరు కలిసి బయటకు వస్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఓకే కుటుంబం లో ఇద్దరు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబీకులు అనాధలుగా మిగిలారు. సంఘటన జరిగిన ప్రాంతంలో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్. ఐ వెలమల ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Geetha Workers latest news Ramabhadrapuram Road Accident Telugu News Vizianagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.