AP Transport Department Elections: ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

Read Time:  1 min
AP Transport Department Elections: ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
FONT SIZE
GET APP

AP Transport Department Elections: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ పోర్ట్ శాఖ జోన్-3 టెక్నికల్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి, ఎపియన్ జిఓ అసోసియేషన్ ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు పరచగా ఎన్నికలు ఏకగ్రీవం గా జరిగినట్లు మొత్తం 9 మంది ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

Read Also: AP 10th Class Exams 2026: ప్రారంభమైన టెన్త్ పరీక్షలు.. విద్యార్థులకు వైఎస్ జగన్ ‘ఆల్ ది బెస్ట్’

AP Transport Department Elections: ట్రాన్స్ పోర్ట్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
AP Transport Department Elections: Transport Officers’ Association Elections Unanimous

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు

ఈ ఎన్నికలలో జోన్ 3 పరిధి లో నూతన కార్యవర్గానికి అధ్యక్షునిగా మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి. బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె. జయప్రకాశ్, ట్రెజర్గా కావలి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె కరుణాకరన్ ఎన్నిక అయ్యారు. గుంటూరు డిస్ట్రిక్ట్ రెప్రజెంటేటివ్స్ గా మొత్తం ఆరుగురు ఏకగ్రీవం అయ్యారు. వీరిలో తెనాలి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ జి. అమృత రాణి, నరసరావుపేట అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మనీషా, చీరాల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.రవి నాయక్, ప్రకాశం జిల్లా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. భానుప్రకాష్, నెల్లూరు జిల్లా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ. మల్లికార్జున్ రెడ్డి, మార్కాపురం జిల్లా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెఎల్ రావు ఏకగ్రీవం అయ్యారు.

సహాయ ఎన్నికల అధికారిగా ఒంగోలు తాలూకా కార్యదర్శి మక్దూం షరీఫ్, ఎన్నికల పరిశీలకు లుగా జిల్లా కార్యనిర్వ హక కార్యదర్శి బి. కృష్ణకిషోర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జోన్-3 పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొని నూతనంగా ఎన్నిక అయిన జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.